అవనిగడ్డ వైసీపీలో విభేదాలు.. ఎంపీ అనుచరులపై ఎమ్మెల్యే మద్దతుదారుల దాడి.. అదేం లేదన్న ఎమ్మెల్యే రమేష్ బాబు..

By Sumanth KanukulaFirst Published Jan 28, 2023, 5:04 PM IST
Highlights

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ బాలశౌరి అనుచరుడిపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అనుచరులు దాడి చేశారు. 

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ బాలశౌరి అనుచరుడిపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అనుచరులు దాడి చేశారు. వివరాలు.. మూడు నెలల క్రితం జరిగిన సీఎం జగన్  పర్యటన సందర్భంగా ఎంపీ బాలశౌరి అనుచరులతో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అనుచరులకు మధ్య విభేదాలు చెలరేగాయి. తాజాగా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నాగాయలంకలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు. అయితే ఫ్లెక్సీ విషయమై ఎంపీ బాలశౌరి పీఏపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ పరిణామాలు ఇరువురు నేతల అనుచరుల మధ్య ఘర్షణకు దారితీసింది. బాలశౌరి అనుచరులపై సింహాద్రి రమేష్ అనుచరులు దాడి చేశారు. చెప్పులతో కూడా కొట్టారు. ఈ ఘటనను ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మేనల్లుడు దాడి చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 

ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు సంబంధించి వస్తున్న వార్తలను ఎమ్మెల్యే రమేష్‌ బాబు ఖండించారు. నాగాయలంకలో వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన తొపులాటపై వస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఎంపీ  బాలశౌరికి తనకు మధ్య ఎటువంటి వర్గ విభేదాలు లేవని తెలిపారు. ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే వర్గమని చెప్పారు. ఈరోజు బాలశౌరి వెంట వచ్చిన గరికపాటి శివ అనే వ్యక్తి నోటి దురసు వలన తోపులాట జరిగిందని అన్నారు. ఈ ఘటన చోటుచేసుకున్న వెంటనే కార్యకర్తలకు నచ్చచెప్పి తోపులాటను ఆపివేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించి వర్గ విభేదాలు అంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. గరికపాటి శివ అనే వ్యక్తి వైసీపీలో ఉంటూ టీడీపీ వాళ్లకి మద్దతు పలుకుతూ గొడవలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ వాళ్ళతో కలిసి వర్గాలు సృష్టిస్తున్నాడని విమర్శించారు. అది తప్పు అని చెప్పినందుకే తమపైలేనిపోని ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టిస్తున్నాడని చెప్పుకొచ్చారు. 
 

click me!