వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ.. పార్టీలోనే ఉంటారు: కేశినేని నాని

By sivanagaprasad Kodati  |  First Published Oct 28, 2019, 2:46 PM IST

వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ అని.. ఆయన ఎట్టి పరిస్ధితుల్లోనూ పార్టీని వీడరన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. వల్లభనేని రాజీనామాపై స్పందించిన ఆయన పార్టీలో వంశీ కొంత ఇబ్బందిపడిన మాట వాస్తవమేనని.. వంశీకి చంద్రబాబు పూర్తి భరోసాను ఇచ్చారని స్పష్టం చేశారు


వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ అని.. ఆయన ఎట్టి పరిస్ధితుల్లోనూ పార్టీని వీడరన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. వల్లభనేని రాజీనామాపై స్పందించిన ఆయన పార్టీలో వంశీ కొంత ఇబ్బందిపడిన మాట వాస్తవమేనని.. వంశీకి చంద్రబాబు పూర్తి భరోసాను ఇచ్చారని స్పష్టం చేశారు. ఆయన అవసరం పార్టీకి.. పార్టీ అవసరం వంశీకి ఉంటుందని కేశినేని తెలిపారు. నేతలను వంశీ కలవడాన్ని తప్పుబట్టలేమన్నారు. 

రెండు రోజుల్లోనే ముగ్గురు నేతలను కలిసి  గందరగోళం సృష్టించారని వంశీపై బొండా ఉమ మహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ముందు రోజు చంద్రబాబునాయుడు ఆ తర్వా రోజున సుజనా చౌదరి అదే రోజు సాయంత్రం ఏపీ సీఎం జగన్ ను కలిసిన విషయాన్ని బొండా ఉమా మహేశ్వరరావు గుర్తు చేశారు.

Latest Videos

తనపై కేసులుపెట్టినా కూడ జిల్లా పార్టీ పట్టించుకోవడం లేదంటూ జిల్లా పార్టీ నాయకత్వంపై వల్లభనేని వంశీ చేసిన ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. తనకు ఉన్న సమస్యలను నేరుగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని బొండా ఉమ మహేశ్వరరావు చెప్పారు.

Also Read:వల్లభనేని రాజీనామా వెనక వైఎస్ జగన్ వ్యూహం ఇదే

టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం నాడు రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు  ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామ చేశారు. ఈ రెండు పదవులతొ పాటు రాజకీయాల నుండి కూడ తప్పుకొంటున్నట్టుగా వల్లభనేని వంశీ ప్రకటించారు.

వంశీ రాజీనామా వెనక ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో వల్లభనేని వంశీ కూడా తెలివిగా వ్యవహరించారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ వంశీ తన లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. 

ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పార్టీలో చేరాలనుకుంటే పదవికి రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్ సూచించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు సూచించారు. ఈ నేపథ్యంలో కర్ర విరగకుండా పాము చావకుండా వల్లభనేని వంశీ విషయంలో వ్యవహరించారనే మాట వినిపిస్తోంది. 

శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన లేఖను వల్లభనేని వంశీ స్పీకర్ కు సమర్పించలేదు. ఇందులోనే మతలబు అంతా ఉందని అంటున్నారు. వల్లభనేని వంశీ రాసిన లేఖకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఆ లేఖకు సమాధానంగా వంశీ చంద్రబాబుకు మరో లేఖ రాశారు. తద్వారా పరిణామానికి ఆయన కొత్త మలుపు ఇచ్చారు. 

వల్లభనేని వంశీ రాజీనామా: బుజ్జగింపులకు చంద్రబాబు కమిటీ

సోమవారం మధ్యాహ్నం తన ప్రత్యర్థి యార్లగడ్డ వెంకటరావు వైఎస్ జగన్ తో భేటీ కానున్న నేపథ్యంలో వంశీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. కృష్ణా జిల్లా మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలను వెంట పెట్టుకుని వంశీ వైఎస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. తాను ఎదుర్కుంటున్న చిక్కులను వంశీ జగన్ కు వివరించారు. వైసిపితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వంశీ ముఖ్యమంత్రితో చెప్పారు. అందుకు జగన్ కూడా అంగీకరించారు. 

దాంతో యార్లగడ్డ వెంకటరావు అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వంశీని పార్టీలో చేర్చుకోవద్దని యార్లగడ్డ వెంకట రావు జగన్ ను కోరారు. దీంతో గన్నవరం రాజకీయాలు వేడెక్కాయి. తాను జగన్ ను కలుస్తున్నానని, జగన్ తగిన న్యాయం చేస్తారని యార్లగడ్డ తన అనుచరులను బుజ్జగిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో యార్లగడ్డకు టోకరా ఇవ్వడానికో, జగన్ వ్యూహరచనలో భాగంగానో తెలియదు గానీ వంశీ తన రాజీనామాను చంద్రబాబుకు మాత్రమే పంపించారు. 

click me!