కాఫీ విత్ కలెక్టర్

First Published Aug 2, 2017, 7:50 PM IST
Highlights
  • బర్మర్ కలెక్టర్  శివప్రసాద్ నాకటే వినూత్న కార్యక్రమం
  • మరుగుదొడ్ల నిర్మాణానికి కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం

 
కలెక్టర్ తో సామాన్యుడు మాట్లాడాలంటేనే ఎన్నో నియమాలు,నిభందనలు అడ్డొస్తాయి. అలాంటిది కలెక్టర్ తో కలిసి కాఫీ తాగడం అదీ వారి ఇళ్లలోనే. కానీ ఈ అవకాశం అందరికి కాదు. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా మరుగుదొడ్లను నిర్మించుకుని, వాటినే వాడుతున్న కుటుంబాలకు మాత్రమే. ఇలా ప్రతీ ఒక్క కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకోవాలని  వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్న కలెక్టర్ ఎవరో తెలుసుకోవాలంటే... చలో రాజస్థాన్. 
  బహిరంగ మలవిసర్జన నిర్మూలనే ధ్యేయంగా పెట్టుకుని, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాడు కలెక్టర్ శివప్రసాద్ నాకటే. రాజస్థాన్ లోని బర్మర్ జిల్లాలో  ఇప్పటికే  173 గ్రామపంచాయతీల్లో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లను నిర్మించి ఇవ్వగా , మిగతా గ్రామపంచాయతీలను కూడా మరుగుదొడ్లను నిర్మించుకునేలా, వాటిని వినియోగించుకునేలా చేయాలని కలెక్టర్ భావించారు.  అందుకోసమే మరుగుదొడ్డి నిర్మించుకున్న ప్రతి ఇంటికి తానే స్వయంగా వచ్చి  కాఫీ తీసుకుంటానని కలెక్టర్ విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మించుకున్న వ్యక్తిని జిల్లా కేంద్రంలో ప్రభుత్వం తరపున సన్మానిస్తామని కలెక్టర్ ప్రకటించారు.  
 దీన్ని అక్కడ స్థానిక ప్రజలు కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమంగా పిలుచుకుంటున్నారు. ఇదివరకు ప్రధాని కూడా ఇలాంటి కార్యక్రమాన్నే చేపట్టి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించగా, అదే బాటలో పయనించి జిల్లా ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నారు కలెక్టర్ శివప్రసాద్. 
 

click me!