భోజనంలో బొద్దింక.. వివాదాల్లో ఆదికవి యూనివర్సిటీ హాస్టల్..

By Bukka SumabalaFirst Published Aug 2, 2022, 10:31 AM IST
Highlights

కాకినాడలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ హాస్టల్ భోజనంలో కప్పలు, బొద్దింకలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆహారం తినాలంటే భయాందోళనలకు గురవుతున్నారు. 

కాకినాడ : ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలోని హాస్టల్ మెస్ ఏదో ఒక కారణంతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. సోమవారం అలాంటి మరో వివాదానికి చిరునామా అయ్యింది. సోమవారంనాడు హాస్టల్ లోని ఓ విద్యార్థి భోజనం చేస్తుండగా.. ఆహారంలో బొద్దింక వచ్చింది. దీంతో ఆ విద్యార్థి వెంటనే ఈ విషయాన్ని మెస్ నిర్వాహకుల దృష్టికి, తన తోటి విద్యార్థుల దృష్టికి తీసుకువెళ్లారు. 

మెస్‌లో భోజనం చేయాలంటే చాలా భయాందోళనలు కలుగుతున్నాయని హాస్టల్ విద్యార్థులు చెబుతున్నారు. ఆదివారం కూడా ఇలాంటి ఘటనే హాస్టల్‌లో చోటుచేసుకుంది. ఒక విద్యార్థికి ఇచ్చిన అల్పాహారంలో ఉడకబెట్టిన కప్ప కనిపించింది. దీన్ని విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. యూనివర్సిటీ అధికారులు దీనిమీద ప్రొఫెసర్ టేకి ని స్పెషల్ అధికారిగా నియమించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. హాస్టల్ మెస్‌కు చెడ్డ పేరు తెచ్చేందుకు ఎవరో కుట్ర పన్నినట్లు యూనివర్సిటీ అధికారులు అనుమానిస్తున్నారు.

వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన హై కోర్టు...

ఓ విద్యార్థి అల్పాహారం అయిన ఉప్మా ప్లేట్ లో కప్ప కనిపించిందని ఆదివారం విద్యార్థులు ఫిర్యాదు చేశారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ టి అశోక్ తెలిపారు. ఘటనపై యూనివర్సిటీ అధికారుల బృందం ఆరా తీసింది. మెస్‌ను పరిశీలించింది. ఇటీవల, ఈ యూనివర్సిటీ విద్యార్థులు నాణ్యమైన, రుచికరమైన ఆహారం, కార్పస్ ఫండ్‌లను తిరిగి చెల్లించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు.

యూనివర్సిటీ అధికారులు హాస్టల్‌కు అయ్యే ఖర్చు, మెస్‌ల గురించి వివరించి ఒక్కో విద్యార్థికి రూ.2వేలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే మరుసటి రోజు విద్యార్థులు ప్రధాన గేటు ఎదుట ఆందోళనకు దిగారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది.

click me!