
గత ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రెండు సంవత్సరాలు గడిచినా హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ తరహాలో జీతాలు తగ్గిస్తామని లీకులు ఇవ్వడం దారుణమన్నారు.