Gaddar: గద్దర్‌కు తెలుగు జాతి సెల్యూట్‌ చేస్తోంది.. ప్రజా కవి మరణంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..

By Mahesh Rajamoni  |  First Published Aug 6, 2023, 5:04 PM IST

Hyderabad: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో గద్దర్‌ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గా విప్లవ స్పూర్తి గద్దర్ అని పేర్కొన్నారు.


Telangana Poet Gaddar: ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస  విడిచారు. ఈ నేపథ్యంలో గద్దర్‌ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గా విప్లవ స్పూర్తి గద్దర్ అని పేర్కొన్నారు. "ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణ పాటే. గద్దర్‌ నిరంతరం సామాజిక న్యాయం కోసమే బ్రతికారు. గద్దర్‌ మరణం ఊహించలేనిది" అంటూ సంతాపం తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గద్దర్ మరణంపై స్పందిస్తూ.. "ప్రజా కవి, గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారు. ఆయన మరణం ఊహించనిది. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్ కు మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందాం" అని అన్నారు.

Latest Videos

click me!