రెండ్రోజులు పోలీసులు సెలవు పెట్టుకొండి... చంద్రబాబో, జగనో తేలిపోతుంది: వెంకన్న హాట్ కామెంట్స్

Published : Aug 06, 2023, 03:04 PM IST
రెండ్రోజులు పోలీసులు సెలవు పెట్టుకొండి... చంద్రబాబో, జగనో తేలిపోతుంది: వెంకన్న హాట్ కామెంట్స్

సారాంశం

పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనపై టిడిపి నేత బుద్దా వెెంకన్న సీరియస్ అయ్యారు. పోలీసులు వైసిపి నాయకుల్లా వ్యవహరిస్తున్నారని వెెంకన్న మండిపడ్డారు. 

విజయవాడ :టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలపై బుద్దా వెంకన్న రియాక్ట్ అయ్యారు. ఈ హింసాత్మక ఘటనలో పోలీసులపై దాడి జరగడం విచారణకరమని... కానీ పోలీసుల సంఘం టిడిపిపై చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. మేం గంటసేపు లేకపోతే బయటకు రాగలరా అంటూ పోలీస్ అధికారుల సంఘం కామెంట్స్ కు వెంకన్న రియాక్ట్ అయ్యారు. పోలీసులు రెండు రోజులు సెలవు పెట్టండి...చంద్రబాబో, జగనో తేలిపోతోందని అన్నారు. మేము ఎవరిపైన దాడులు చేయం .. మాపైన దాడులు చేస్తే వదలం అని వెంకన్న హెచ్చరించారు. 

పుంగనూరులో చంద్రబాబుపై దాడి చేయడానికి  వైసిపి పార్టీ విఫలమైందని వెంకన్న అన్నారు. పోలీస్ వ్యవస్థను చెప్పు చేతల్లో పెట్టుకొని టిడిపి శ్రేణులపై వైసిపి దాడులకు తెగబడుతోందన్నారు. చంద్రబాబు పర్యటనను లారీ అడ్డం పెట్టి అడ్డుకుంది ఎవరు? ఆ లారీని పక్కకు తీస్తుంటే టిడిపి కార్యకర్తలు పై పోలీసులు లాఠీఛార్జి చేశారన్నారు. రోడ్డుకు లారీ అడ్డం పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారా? అని ప్రశ్నించారు. పద్నాలుగేళ్లు సిఎంగా ఉన్న చంద్రబాబు ను అడ్డుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని వెంకన్న ప్రశ్నించారు. 

వీడియో

టిడిపి అధినేత మీదకు దాడికి వస్తే చూస్తూ ఊరుకోవాలా?  అని వెంకన్న ప్రశ్నించారు.చిత్తూరు జిల్లా ఎస్పీ వైసిపి నాయకుడిలా మాట్లాడుతున్నారన్నారు. పోలీసు అధికారుల సంఘానికి టిడిపి నాయకులే గుర్తు వస్తారా? మీ అధికారులను బూతులు తిట్టిన మంత్రులు‌ను ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబు ను వ్యక్తిగతంగా దూషిస్తే  తప్పు అని జగన్ ని కోరారా? అని వెంకన్న నిలదీసారు. 

Read More  పుంగనూర్ ఘటనపై మూడు కేసులు నమోదు.. 50 మంది అరెస్ట్!!

ఏపీ డిజిపితో పాటు పోలీస్ అధికారులు విషాంత్ రెడ్డి, అమ్మిరెడ్టి లు చంద్రబాబుపై పగతో పని చేస్తున్నారని వెంకన్న ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజల్లో‌ వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ఈ ఆటంకాలు, దాడులు చేయిస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్ లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? అని ప్రశ్నించారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది... పోలీసులను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని అన్నారు. పదవుల కోసం కొంతమంది పోలీసులు వైసిపి నాయకులకు కొమ్ము కాస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. 

 

PREV
click me!

Recommended Stories

లోకేష్ వల్లే విశాఖకు గూగుల్: CM Nara Chandrababu Naidu Speech | Asianet News Telugu
కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | TDP New Executive Committee