పిన్నెల్లికి సీఎంఓనుండి ఫోన్: మీ అభిమానానికి థ్యాంక్స్ అంటూ ఫోన్ పెట్టేసిన ఎమ్మెల్యే

By narsimha lode  |  First Published Apr 10, 2022, 5:35 PM IST


మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో చోటు దక్కలేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ విషయమై సీఎంఓ నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ వస్తే ఆయన సీరియస్ గా సమాధానం చెప్పారని సమాచారం.


గుంటూరు: మంత్రివర్గ పునర్వవ్యవస్థీకకరణకు సంబంధించి  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు లేదనే ప్రచారంతో  YCP ప్రజా ప్రతినిధులు నిరసన బాట పట్టారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎంసెక్రటరీ ధనుంజయ్ రెడ్డి మాచర్ల ఎమ్మెల్యే Pinnelli Ramakrishna Reddyకి ఫోన్ చేశారు.

Macherlaఅసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన  వైసీపీ ప్రజా ప్రతినిథులు భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు లేకపోవడంపై వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవులు ఇవ్వాలని డిమాంండ్ చేశారు. 

Latest Videos

 వైసీపీ ప్రజా ప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాల నేపథ్యంలో సీఎంఓ నుండి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ వచ్చింది. సీఎం సెక్రటరీ Dhanunjaya Reddy ఫోన్ చేశారని సమాచారం.  అయితే సీఎం సెక్రటరీ ధనుంజయ్ రెడ్డితో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహంగా పోన్ మాట్లాడి పెట్టేశారని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు. 

మీరు చూపిన అభిమానానికి థ్యాంక్స్ అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యంగ్యంగా మాట్లాడి ఫోన్ పెట్టేసినట్టుగా తెలుస్తోంది. తొలి మంత్రివర్గంలో  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన  మంత్రులు ఐదుగురున్నారు. 

అయితే ఈ దఫా Reddy సామాజికవర్గానికి చెందిన మంత్రుల సంఖ్యను ఇంకా తగ్గించాలని కూడా జగన్ భావిస్తున్నారని ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లో ఉంది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరును మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో  పరిశీలించలేదనే ప్రచారం కూడా సాగుతుంంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ కూర్పుపై జగన్ కసరత్తు చేశారు.

తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న Balineni Srinivasa Reddy ని కూడా మంత్రివర్గం నుండి తప్పించారనే ప్రచారం కూడా సాగుతుంది.  అలకబూనిన బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గ కూర్పు విషయమై జగన్ ఆలోచనను బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

గత కేబినెట్ లో పనిచేసిన 10 మందిని AP Cabinet Reshuffle లో చోటు కల్పించారు. కొత్త వారిలో 15 మందికి చోటు కల్పించారు.సీనియారిటీతో పాటు పాలనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 10 మంది పాత వారికి కేబినెట్ లో చోటు కల్పించారు. దీనికి తోడు ఆయా జిల్లాల సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కూడా పాతవారికి  చోటు కల్పించారు.

గత Cabinet లో చురుకుగా వ్యవహరించిన మంత్రులను పార్టీ అవసరాల కోసం వినియోగించుకోనున్నారు. గత మంత్రివర్గం నుండి తప్పించిన 15  మందికి పార్టీ కోసం వినియోగించుకోనున్నారు.

వచ్చే రెండేళ్ల తర్వాత ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గాను అవసరమైన టీమ్ ను ఎంపిక చేసుకోవాలని YS Jagan భావించారు. పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేసేందుకు గాన మంత్రివర్గం నుండి తప్పించిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. 

ఈ నెల 7వ తేదీన గత మంత్రివర్గం చివరి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో  మంత్రుల నుండి రాజీనామాలు తీసుకున్నారు. 24 మంది మంత్రులు రాజీనామా లేఖలను సీఎంకు అందించారు.  ఈ రాజీనామాలను రాజ్ భవన్ కు పంపారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  ఈ రాజీనామాలను ఆమోదించారు. కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్ రాజ్ భవన్ ను పంపారు. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కిన వారికి సీఎం జగన్ ఫోన్లు చేసి అభినందించారు.
 

click me!