ఏపీ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ: ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ గా మల్లాది విష్ణు నియామకం

By narsimha lode  |  First Published Apr 10, 2022, 5:19 PM IST

ఏపీ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణతో పాటు సామాజిక సమీకరణాల  నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలకు నామినేటడ్ పదవులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ గా మల్లాది విష్ణును నియమించనున్నారు.


అమరావతి:  ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణతో పాటు పార్టీ అవసరాల రీత్యా పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులను కట్టబెట్టాలని సీఎం YS Jaganనిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు  ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గా Prasada Rajuను నియమించాలని నిర్ణయం తీసుకొన్నారు.  ఈ పదవిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇప్పటివరకు కొనసాగారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రసాదరాజుకు ఈ పదవిని ఇచ్చారు. చీఫ్ విప్ కేబినెట్ హోదా ఉంటుంది.

 ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి ఉన్నారు.  ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా kolagatla Veerabhadra Swamyని  చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. మరో వైపు ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ గా  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన Malladi Vishnuను నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. త్వరలో ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.ఈ బోర్డుకు కొడాలి నానిని చైర్మెన్ గా నియమించనున్నారు.
 

Latest Videos

click me!