గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మరిన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
గుంటూరు: లాక్‌డౌన్ 5.0 నిబంధనలను అనుసరించి గుంటూరు జిల్లాలో కొత్త కంటైన్మెంట్ జోన్లను ప్రకటించిన వైసిపి ప్రభుత్వం. ఇటీవల కరోనా కేసులు నమోదయిన పలు ప్రాంతాలను కొత్తగా కంటైన్మెంట్ పరిధిలోకి ప్రభుత్వం తీసుకువచ్చింది.
గుంటూరు జిల్లాలోని కటైన్మెంట్ జోన్ల జాబితా ఇదే...
undefined
నాదెండ్ల మండలం చందవరం, గొరిజవోలులో కంటైన్మెంట్ విధింపు
దుగ్గిరాల మండలం చింతలపూడిలో కంటైన్మెంట్ ఆంక్షలు విధింపు
గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో కంటైన్మెంట్ ఆంక్షలు
చిలకలూరిపేట గుర్రాలచావిడి ప్రాంతంలో కంటైన్మెంట్ విధింపు
యడ్లపాడు, తిమ్మాపురం, వనికుంట కట్టడి విధింపు
మంగళగిరి సివిల్ క్వార్టర్స్ ,నవులూరులో కంటైన్మెంట్ జోన్ కొత్తగా అమలు
గుంటూరు సీతారాంనగర్, హుస్సేన్ నగర్ లో కంటైన్మెంట్ విధింపు
గుంటూరు కేవీపీ కాలనీ, ఏటీ అగ్రహారంలో కంటైన్మెంట్ విధింపు
గుంటూరు కన్నవారితోట, శ్రీనివాసరావుతోట 60అడుగుల రోడ్డులో ఆంక్షలు
గోరంట్ల, ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ కళాశాల రోడ్డులో కంటైన్మెంట్ విధింపు
గుంటూరు శ్యామలా నగర్, స్కైలార్క్ అపార్టుమెంటులో కంటైన్మెంట్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. సోమవారం రోజులోనే 105 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో రాష్ట్రానికి చెందినవారు 76 మంది ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 28 మంది ఉన్నారు. కొత్తగా గత 24 గంటల్లో మరో రెండు మరణాలు సంభవించాయి. మొత్తంగా 10,567 శాంపిల్స్ ను పరీక్షించగా 76 మందికి కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 34 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. కోయంబేడుకు చెందిన కేసులు 9 ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 3118కి చేరుకుంది. ఇందులో 2169 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 885 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాలు 64కు చేరుకున్నాయి.
విదేశాల నుంచి వారిలో 112 మంది కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మొత్తం కేసులు కూడా యాక్టివ్ గానే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 446 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో 249 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.