సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్: తిరుమల నుంచి హాజరైన జగన్

By Siva KodatiFirst Published Sep 23, 2020, 7:14 PM IST
Highlights

టీటీడీ అన్నమయ్య భవన్‌లో ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 

టీటీడీ అన్నమయ్య భవన్‌లో ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కోవిడ్‌కు సంబంధించిన 7 రాష్ట్రాల సీఎంతో ప్రధాని ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

ఏపీ హోంమంత్రి సుచరిత, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అంతకుముందు పద్మావతి అతిథిగృహంలో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సీఎం జగన్‌ను కలిశారు.

Also Read:పంచెకట్టు, తిరునామంతో జగన్: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

పదవీ విరమణ పొందిన మిరాశీ అర్చకుల విషయం ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో ముఖ్యమంత్రిని కలిశామని ఈ సందర్భంగా రమణ దీక్షితులు తెలిపారు. అనంతరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

స్వామి వారికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుమందు బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య జగన్ ఊరేగింపుగా వెళ్లి శ్రీ వేంకటేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించారు. పంచెకట్టు, తిరునామంతో ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి గరుడ సేవలో జగన్ పాల్గొంటారు. 
 

click me!