ఏపీ ప్రయోజనాలను కాపాడటంలో జ‌గ‌న్ విఫలం : కాంగ్రెస్ సీనియర్ లీడర్ తులసిరెడ్డి

By Mahesh Rajamoni  |  First Published Sep 18, 2023, 1:52 PM IST

Amaravati: సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజనాలను కాపాడటంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విఫలమయ్యారని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు తులసిరెడ్డి ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నా జగన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.
 


Senior Congress leader Dr N Tulasi Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు డాక్ట‌ర్ ఎన్ తుల‌సి రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజనాలను కాపాడటంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విఫలమయ్యారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నా జగన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే సాగునీటి ప్రాజెక్టులను తెలంగాణ చేపడుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందని తులసిరెడ్డి వేంపల్లెలో మీడియా ప్రతినిధులతో అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల జాబితాలో చేర్చలేదన్నారు.

Latest Videos

undefined

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులైన గాలేరు నగిరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్), హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్), తెలుగుగంగ, వెలుగోడు వంటి సాగునీటి ప్రాజెక్టుల కింద 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందదనీ, ఎందుకంటే ఏపీ దిగువ నదీ పరీవాహక రాష్ట్రమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ 16 మే 18 నుంచి 2016 వరకు జలదీక్షలో పాల్గొన్నారని తులసిరెడ్డి గుర్తు చేశారు. 

ఇప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టును నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటే మౌనం వహించడంపై జగన్ ఏపీ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి స్పందించి ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

click me!