రాజమండ్రి జైలులో చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, యనమల ములాఖత్..

By Sumanth Kanukula  |  First Published Sep 18, 2023, 1:01 PM IST

రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు.


రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. చంద్రబాబుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి‌లతో పాటు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు వారు చంద్రబాబుతో మాట్లాడనున్నారు. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడనున్నట్టుగా టీడీపీ వర్గాలు తెలిపాయి.

ఇదిలాఉంటే, చంద్రబాబు ఆరోగ్యం కోసం రాజమండ్రి శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి ఆలయంలో  భువనేశ్వరి ఈరోజు ఉదయం పూజలు నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 

Latest Videos

click me!