అమూల్‌తో పాడి రైతులకు రూ. 10 కోట్ల అదనపు ఆదాయం.. కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ను ప్రారంభించిన సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published Dec 29, 2021, 12:38 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy అన్నారు. బుధవారం కృష్ణా జిల్లాలో (krishna district) 'జగనన్న పాలవెల్లువ' (jagananna pala velluva) కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy అన్నారు. బుధవారం కృష్ణా జిల్లాలో (krishna district) 'జగనన్న పాలవెల్లువ' (jagananna pala velluva) కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ వర్చువల్‌గా పాడి రైతులతో మాట్లాడారు. కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. పాలవెల్లువ ద్వారా పాడి రైతులకు మెరుగైన ధరల అందుతుందని చెప్పారు. అమూల్ ఒక కంపెనీ కాదని.. పాలు పోసే వాళ్లే యజమానులు అని అన్నారు. 

అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే పాల సేకరణ చేస్తుందని సీఎం జగన్ గుర్తుచేశారు. ప్రకాశం, చిత్తూరు, కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ జరుగుతోంన్నారు. అమూల్ సంస్థ.. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఐదు జిల్లాల్లో 30, 951 మంది మహిళా పాడి రైతుల నుంచి 168.50 లక్షల లీటర్ల పాల సేకరణ చేసింది. దాదాపు 71 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ఇతర డెయిరీలకు పాల సరఫరా చేస్తే వచ్చే దాని కంటే.. రూ. 10 కోట్లు అదనంగా ఆదాయం వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నారు. అమూల్ రావడంతో అక్కాచెళ్లమ్మలకు రూ. 10 కోట్లు మేలు జరిగింది.  

‘పాలవెల్లువ నేడు ఆరో జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. పాడి రైతులకు మరింత మెరుగైన ధర వస్తుంది. పాల ప్రాసెసింగ్‌లో దేశంలోనే అమూల్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. అమూల్‌ పాల సేకరణ ధర మిగిలిన వాటికన్నా ఎక్కువ. ప్రపంచంలో అమూల్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. అందుకే అధికారంలోకి రాగానే అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని పాల సేకరణ చేస్తున్నాం. అమూల్ సంస్థ పాల బిల్లులు నేరుగా 10 రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏడాదిలో  182 రోజులు మహిళ పాడి రైతులకు ప్రతి లీటర్‌పై 50 పైసలు కూడా చెల్లిస్తారు. నాణ్యమైన దాణాను కూడా తక్కువ ధరకే సరఫరా చేస్తుంది ’ అని సీఎం జగన్ తెలిపారు.

ప్రభుత్వంలోని వ్యక్తులకే ప్రైవేటు డెయిరీలో వాటాలు ఉండటం వల్ల మంచి ధరలు మహిళలకు ఇప్పించాలనే తపన, తాపత్రాయం ఎప్పుడూ ఉండేది కాదని సీఎం జగన్ విమర్శించారు. అందుకే తమ ప్రభుత్వం వాటిని మార్చేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో పాడి ఎక్కువగా ఉన్న 4,796 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. మహిళా పాడి రైతులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా బల్క్ మిల్క్ కూలింగ్ యంత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

‘సహకార డెయిరీలలో కొన్ని మంచి వాటిని ప్రైవేట్ వ్యక్తులు టేకోవర్ చేసుకుని నడుపుతున్నారు. పాడి రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి దోచుకున్న డెయిరీలకు, వాటి ద్వారా లబ్ది పొందుతున్నవారికి.. పాడి మార్కెట్‌తో ప్రభుత్వం తరఫున పోటీ వచ్చే సరికి వారికి దిక్కుతోచడం లేదు. అమూల్ రావడంతో వారు కూడా రైతులకు ఇచ్చే రేట్లు పెంచుతున్నారు. ఇది ఒక మంచి పరిణామం’ అని సీఎం జగన్ అన్నారు. 

click me!