తాడేపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ దంపతులు..

Published : Jan 14, 2023, 11:36 AM IST
తాడేపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ దంపతులు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ తన సతీమణి భారతీరెడ్డి‌తో కలిసి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ తన సతీమణి భారతీరెడ్డి‌తో కలిసి పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాల ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సీఎం జగన్ దంపతులు తొలుత గోపూజ నిర్వహించారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు.. అక్కడ ఏర్పాటు  చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలను తిలకించారు. ఇక, ఈ సంక్రాంతి వేడుకల కోసం సీఎం జగన్ నివాస ఆవరణలో పల్లె వాతావరణాన్ని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా సెట్స్‌ను తీర్చిదిద్దారు. 

ఇక, ఈ రోజు ఉదయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లిషు విద్యకు నెలవుగా, ఆరోగ్యచికిత్సలకు కేంద్రంగా, మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సంక్రాంతిని అవి మరింత ద్విగుణీకృతం చేస్తాయని విశ్వసిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్