తిరుపతిలో వింత పాము... ఎక్కడ వదిలిపెట్టినా మళ్లీ ప్రత్యక్షమౌతూ...!

Published : Jan 14, 2023, 10:49 AM IST
తిరుపతిలో  వింత పాము... ఎక్కడ వదిలిపెట్టినా మళ్లీ ప్రత్యక్షమౌతూ...!

సారాంశం

ఆ పామును ఎక్కడకు తీసుకువెళ్లి వదిలిపెట్టినా... మళ్లీ అక్కడకే వచ్చి కనపడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి ఈ పాము స్థానికుల నుంచి పూజలు అందుకుంటోంది.

తిరుపతిలో ఓ వింత పాము ప్రత్యక్షమైంది. తిరుపతిలోని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట లోని పెద్ద చెరువు సమీపంలో  ఓ వింత పాము కనిపించింది. ఆ పామును ఎక్కడకు తీసుకువెళ్లి వదిలిపెట్టినా... మళ్లీ అక్కడకే వచ్చి కనపడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి ఈ పాము స్థానికుల నుంచి పూజలు అందుకుంటోంది.

పది రోజుల క్రితం 4 అడుగుల నాగుపామును పెద్ద చెరువు కట్ట పై రోడ్డు పక్కన ఈ పామును చూశారు.  ఆ పాము వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ... ఎన్ని రోజులు అయినా...ఆ పాము వెళ్లడం లేదు. వెళ్లడం లేదని దూరంగా వదిలిపెట్టి వచ్చారు. అయినా కూడా... అది వెళ్లకుండా అక్కడే ఉండటం గమనార్హం. దీంతో... ఆ పాము దైవం అని భావించి... స్థానికులు దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ పాముని పట్టుకున్నా కూడా ఎవరినీ కాటేయకపోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే