రాష్ట్రానికి వచ్చింది రూ. 142 కోట్ల కొత్త నోట్లేనా

Published : Nov 18, 2016, 12:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
రాష్ట్రానికి వచ్చింది రూ. 142 కోట్ల కొత్త నోట్లేనా

సారాంశం

ఏపిని ప్రత్యేకంగా కాదు కదా కనీసం ఇతర రాష్ట్రాలతో సమానంగా కూడా చూడటం లేదన్న విషమం స్పష్టం అవుతోంది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రానికి వచ్చింది రూ. 142 కోట్లేనా ? అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ప్రజల తక్షణావసరాలు తీర్చటానికి కేంద్రం వెంటనే రూ. 1500 కోట్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఆర్బ్ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు లేఖ రాసారు. అయితే, వచ్చింది మాత్రం కేవలం రూ. 142 కోట్లు మాత్రమే. దాంతో రాష్ట్రానికి వచ్చిన మొత్తం ప్రజల అవసరాలకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. దానికితోడు ఖాతాల్లో ఉన్న డబ్బు తీయాలన్నా సవాలక్ష ఆంక్షలు. దాంతో ప్రజలకు అవస్తలు తప్పటం లేదు.

 

ఇదే విషయమై శుక్రవారం జరిగిన సమీక్షలో చంద్రబాబునాయడు వాపోయినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై సిఎం బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చించి పెద్ద నోట్ల మార్పిడిపై వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ. 1500 కోట్లు కావాలని లేఖ రాస్తే వచ్చింది రూ. 142 కోట్లేనని సమాచారం. అంటే అడిగిన దాన్లో 10 వంతు మాత్రమే కేంద్రం విధిల్చిచింది. అందుకే ప్రస్తుత అవరాలను కూడా దృష్టిలో పెట్టుకుని తాజాగా రూ. 5 వేల కోట్లు కావాలంటూ మళ్ళీ లేఖ రాస్తున్నారు.

 

అదే సందర్భంలో రిజర్వ్ బ్యాంకుతో పాటు రాష్ట్ర స్ధాయి బ్యాంకుల పనితీరు పట్ల కూడా సిఎం అసంతృప్తి వ్యక్తం చేసారు. పనిలో పనిగా మొబైల్ బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేయటంలో భాగంగా సర్వీస్ ప్రొవైడర్లతో శనివారం సిఎం సమావేశం అవ్వనున్నారు. నగదు రహిత లావాదేవీలపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. నిత్యావసరాలైన కందిపప్పు, నూనెలు తదితరాలను మార్కెట్ కన్నా తక్కువ ధరలకు అందివ్వాలని ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలంటూ ఉన్నతాధికారులను కోరారు. మొబైల్ ఫోన్ల ద్వరా చేసే లావాదేవీలపై ప్రోత్సాహకాలందించాలని కూడా చెప్పారు.

 

నోట్ల రద్దు నేపధ్యంలో రాష్ట్రానికి కేవలం రూ. 142 కోట్లు మాత్రమే అందినట్లు సిఎం చెప్పటం పట్ల పలువురు విస్తుపోతున్నారు. ఇంతటి కష్ట కాలంలో కూడా కేంద్రం ఏపిని ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న విషయం స్పష్టమైందంటున్నారు. మరి, చంద్రబాబునాయడికి  ప్రధానమంత్రి, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో సన్నిహిత సంబంధాలుండీ ఉపయోగం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏపిని ప్రత్యేకంగా కాదు కదా కనీసం ఇతర రాష్ట్రాలతో సమానంగా కూడా చూడటం లేదన్న విషమం స్పష్టం అవుతోంది.

 

 

 

 

  

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu