రాష్ట్ర మంతా ’అన్న క్యాంటీన్ ’ లు

Published : Nov 18, 2016, 11:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
రాష్ట్ర మంతా ’అన్న క్యాంటీన్ ’ లు

సారాంశం

రాష్ట్రమంతా అన్న ఎన్టీ ఆర్ క్యాంటీన్లు. ముందు నగరాలు తర్వాత  చిన్న  పట్టణాల్లో ఏర్పాటు

 రాష్ట్రంలోని  అన్ని ప్రాంతాల్లో ‘అన్న  కేంటీన్లు’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

 

ముందుగా నగరాలు, పట్టణాలలో ‘అన్న కేంటీన్ల’ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సామాన్యులకు సైతం నాణ్యమైన ఆహారాన్ని అతి తక్కువ ధరకే పరిశుభ్రమైన వాతావరణంలో అందించేలా చూడాలని స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలోని తన కార్యాలయంలో ‘అన్న కేంటీన్ల’పై పౌరసరఫరాల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.  

 

రెండు రుపాలయలకు కిలో బియ్యం అందించి  1980 పూర్వార్ధంలో పేదలకు ఆహారభద్రత కల్పించిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు గౌరవార్థం ఈ పథకం ప్రారంభిస్తున్నారు. ఇది ఎన్నికల వాగ్దానమయినా మొదటి క్యాంటీన్ ను నెలకొల్పేందుకు దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది.

 
అత్యుత్తమంగా ‘అన్న కేంటీన్ల’ను నెలకొల్పేందుకు తమిళనాడులో నిర్వహిస్తున్న ‘అమ్మ కేంటీన్ల’ను పరిశీలించడంతో పాటు, దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ, అక్షయ పాత్ర ఫౌండేషన్‌తోనూ చర్చలు జరిగాయి. అధికారులు మంత్రులు కూడా తమిళనాడు వెళ్లి ఈ క్యాంటీన్ల పనితీరు పరిశీలించి వచ్చారు.

 

మొట్టమొదటి అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ను జూన్ లో నెలలో  వెలగపూడి తాత్కాలిక సెక్రెటేరియట్ వద్ద ప్రారంభించారు.

 


.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?