కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం రమేష్ దీక్ష: ఆది

First Published Jun 14, 2018, 6:21 PM IST
Highlights

కడప స్టీల్‌ ఫ్లాంట్  ఏర్పాటుపై వేడేక్కిన రాజకీయం

కడప: కడప స్టీల్ ఫ్లాంట్ నిర్మాణం విషయంలో  కేంద్ర ప్రభుత్వవైఖరిని నిరసిస్తూ  త్వరలోనే ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేయనున్నట్టు  ఏపీ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి  ఆదినారాయణరెడ్డి ప్రకటించారు.

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.ఏపీ రాష్ట్రంలోని కడపలో, తెలంగాణలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై టాస్క్‌ఫోర్స్ కమిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోందని  కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో టిడిపి స్పందించింది.

కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై  కేంద్రానికి చిత్తశుద్ది లేదని  మంత్రి ఆదినారాయణ రెడ్డి  ఆరోపించారు. వైసీపీ నేతలు ఎందుకు  ఈ విషయమై స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. మరో వైపు పాదయాత్రను వదిలి రావాలని ఆయన జగన్ కు పిలుపునిచ్చారు. కడపలో స్టీల్ ఫ్లాంట్ నిర్మాణం కోసం  కలసి పోరాటం చేద్దామని  జగన్ కు ఆయన పిలుపునిచ్చారు. 

కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై  ఎంపీ సీఎం రమేష్  దీక్షకు సిద్దమౌతున్నారని ఆయన చెప్పారు  త్వరలోనే దీక్ష చేస్తారని ఆయన చెప్పారు.  అయితే ఎక్కడ దీక్ష చేస్తారనే వేదికను ఇంకా నిర్ణయించలేదన్నారు. 


కేంద్రంపై ఎంపీ గల్లా జయదేవ్ నిప్పులు

కడపలో స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు విషయమై  కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై  గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు.  టాస్క్‌ఫోర్స్ సాధ్యాసాధ్యాలను పరిశీలించునుందని చేసిన ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నారు. కేంద్రానికి  బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమర్పించిన వినతి పత్రంలో  కాపు రిజర్వేషన్‌, ప్రత్యేక హోదా అంశాలను ఎందురకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. కడపలో స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం కేంద్రానికి లేదన్నారు.

click me!