లైంగిక వేధింపులపై విద్యార్ధిని ఫిర్యాదు
నెల్లూరు: నెల్లూరు మెడికల్ కాలేజీలో విద్యార్ధినిపై ప్రోఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ విద్యార్ధిని బంధువులు ప్రోఫెసర్పై దాడికి పాల్పడ్డారు.
గురువారం నాడు నెల్లూరు మెడికల్ కాలేజీలో ప్రోఫెసర్ మెడిసిన్ ఫైనలియర్ విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితురాలు తమ కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు ప్రోఫెసర్ పై కాలేజీలోనే దాడికి పాల్పడ్డారు.
ఈ విషయాన్ని గుర్తించిన కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలేజీ సిబ్బంది యువతి బంధువులకు నచ్చజెప్పారు. తనపై ప్రోఫెసర్ వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.
ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో వైపు తనపై బాధితురాలు చేసిన ఆరోపణలను ప్రోఫెసర్ ఖండించాడు. హజరుశాతం విషయమై తాను ఖచ్చితంగా వ్యవహరించడంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయమై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.