ప్రధాని మా అంతు చూస్తా అన్నారు...ముల్లుని ముల్లుతోనే తీస్తాం: సీఎం రమేశ్

By sivanagaprasad kodatiFirst Published Oct 12, 2018, 10:36 AM IST
Highlights

తన ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడులపై టీడీపీ నేత, ఎంపీ సీఎం రమేశ్ ఘాటుగా స్పందించారు. అవిశ్వాసం రోజున ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయంపై గట్టిగా నిలదీసినందుకే ప్రధాని మాపై కక్ష గట్టారన్నారు

తన ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడులపై టీడీపీ నేత, ఎంపీ సీఎం రమేశ్ ఘాటుగా స్పందించారు. అవిశ్వాసం రోజున ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయంపై గట్టిగా నిలదీసినందుకే ప్రధాని మాపై కక్ష గట్టారన్నారు..

సభలో చర్చ సందర్భంగా లేచి మాట్లాడుతున్న టీడీపీ ఎంపీలను ఉద్దేశించి.. ‘‘వస్తున్నా.. వస్తున్నా మీ దగ్గరికే వస్తున్నా.. మీ అంతు చూస్తాను ’’ అని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారని రమేశ్ గుర్తు చేశారు.

ఆయనకు వ్యతిరేకంగా ఉన్నందుకు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో ఏ విధంగా వ్యహరించారో ఇప్పుడు అదే విధానాన్ని తెలుగుదేశం పట్లా, ఆంధ్రప్రదేశ్ పట్లా అమలు చేస్తున్నారని సీఎం రమేశ్ ఆరోపించారు.

ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని జాతీయ నేతల దృష్టికి దీనిని తీసుకువెళతామని అన్నారు. తాము తొలి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పని చేస్తున్నామని.. మమ్మల్ని ప్రలోభపెట్టేందుకు చాలా సార్లు ప్రయత్నించారని సీఎం రమేశ్ వెల్లడించారు. జగన్, విజయసాయి రెడ్డి చెప్పిన మాటలను మోడీ, అమిత్ షాలు గుడ్డిగా వింటున్నారని రమేశ్ ఆరోపించారు.

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు

దాడులు ఎందుకు..? పీఏసీ మెంబర్‌ హోదాలో అడిగిన రమేశ్.. మూడు రోజుల్లోనే ఐటీ రైడ్

click me!