తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్, నాదెండ్ల మనోహర్

By ramya neerukondaFirst Published Oct 12, 2018, 10:23 AM IST
Highlights

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన నాందెడ్ల మనోహర్‌ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటుచేసి జనసేనలో చేరతున్నట్లు ప్రకటించనున్నారు.

తిరుమల శ్రీవారిని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ లు శుక్రవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన నాందెడ్ల మనోహర్‌ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటుచేసి జనసేనలో చేరతున్నట్లు ప్రకటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి జనసేన తరపున ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నాదెండ్ల మనోహర్‌ సమైఖ్య రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది నేతలు కాంగ్రెస్‌ను వీడినా ఆయన మాత్రంలో అందులోనే కొనసాగారు. అయితే కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీకి ఆయన దూరంగా ఉంటున్నారు. దీంతో మనోహర్‌ పార్టీ మారనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు.

click me!