శ్రీకాకుళంకు చేరుకున్న చంద్రబాబు: తిత్లీ తుఫాన్ పై రివ్యూ

By Nagaraju TFirst Published Oct 11, 2018, 10:00 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా చేరుకున్నారు. తిత్లీ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుందని ముందే ఊహించిన చంద్రబాబు రెండు రోజులుగా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అటు శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారుల సూచనలతో మంగళగిరి నుంచి ఎన్డీఆర్ ఎఫ్ బలగాలను బుధవారమే శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు.  
 

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా చేరుకున్నారు. తిత్లీ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుందని ముందే ఊహించిన చంద్రబాబు రెండు రోజులుగా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అటు శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారుల సూచనలతో మంగళగిరి నుంచి ఎన్డీఆర్ ఎఫ్ బలగాలను బుధవారమే శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు.  

తిత్లీ తుఫాన్ తో అల్లాడుతున్న ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు చంద్రబాబు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో పునరావాస ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు అమరావతి నుంచి విశాఖకు బయలు దేరిన సీఎం అక్కడ నుంచి నేరుగా శ్రీకాకుళం వెళ్లారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ, నారాయణలతోపాటు సీఎం సెక్రటరీ రాజమౌళి, జిల్లా కలెక్టర్ ధనుంజయ్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

తిత్లీ తుఫాన్ ధాటికి ఎక్కడ ఎక్కడ ప్రభావం వాటిల్లింది అన్న అంశంపై చంద్రబాబు ఆరా తీశారు. తిత్లీ తుఫాన్ ప్రభావం పరిణామాలను కలెక్టర్ ధనుంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. పునరావాస ఏర్పాట్లను ఎప్పటికప్పుతు తనకు తెలపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచించారు. విద్యుత్ పునరుద్దీకరణపై పనులు వేగవంతం చెయ్యాలని విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావుకు చంద్రబాబు ఆదేశించారు. 

అలాగే జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలకు పునరావాస చర్యలు చేపట్టాలని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వంశధావర నిర్వాసిత గ్రామాలు, జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన జల్లూరు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. 

ప్రజలకు తాగునీరు, ఆహార పదార్ధాల సరఫరాలపై చంద్రబాబు అడిగితెలుసుకున్నారు.  హుదూద్ తుఫాన్ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో బస చేసి దగ్గర ఉండి పునరావాస ఏర్పాట్లను పరిశీలించారు.  

click me!