వైసీపీ తుది జాబితాను సంక్రాంతి పండుగ తర్వాత విడుదల చేయనుంది. దీంతో మొత్తం 175 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుంది. వచ్చే నెల లేదా మార్చిలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే జనవరి 25వ తేదీ నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఫుల్ ఎలక్షన్ క్యాంపెయిన్ మోడ్‌లో ఈ పర్యటన ఉంటుందని చెబుతున్నారు.
CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అతి కీలకఘట్టమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. సంక్రాంతి తర్వాత తుది, నాలుగో ఇంచార్జీల (అభ్యర్థుల) జాబితాను వైసీపీ విడుదల చేయనుంది. దీంతో రాష్ట్రంలో 175 స్థానాలకు ఇంచార్జీల ప్రకటన పూర్తి కానుంది. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి, సీఎం జగన్ ఇక ఎలక్షన్ మోడ్‌లోకి వెళ్లుతున్నట్టు తెలిసింది. ఈ నెల 25వ తేదీ నుంచి ఆయన ఫుల్ క్యాంపెయిన్ మోడ్‌లోకి వెళ్లుతున్నారని సమాచారం. 25వ తేదీ నుంచి ఆయన జిల్లాల పర్యటన చేపట్టబోతున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
సీఎం జగన్ ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఆయన పర్యటన ప్రారంభం అవుతున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలో బహిరంగ సభలు, క్యాడర్‌తో సమావేశాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి రోజుకు రెండు మీటింగ్‌ల చొప్పున ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలిసింది. అయితే, పర్యటన రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి? ఏ విధమైన ప్రోగ్రామ్స్ ఉండాలి? అనే అంశాలపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
Also Read : TS News: పార్టీ ఓటమికి నేనే బాధ్యుడ్ని: కేటీఆర్.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై క్లారిటీ
ఈ సభల్లో ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ ప్రసంగాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సాధికారత కార్యక్రమాలపైనా చర్చ చేసే అవకాశం ఉన్నది. అదే విధంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడనున్నారు. వాటి విమర్శలను తిప్పికొట్టనున్నారు.