
Anil Kumar Yadav: నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై కొన్ని రోజులుగా వైసీపీవర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఎట్టకేలకు సీఎం జగన్ ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు. నరసరావుపేట ఎంపీ స్థానంలో బరిలోకి దిగాలని అనిల్ కుమార్ యాదవ్‌కు జగన్‌ను సూచించినట్టు తెలిసింది. దీంతో అనిల్ కుమార్ యాదవ్ తన పోరాటానికి సిద్దం అవుతున్నారు.
నరసరావు పేట ఎంపీ స్థానంపై వైసీపీ మొదటి నుంచి ఒక బలమైన బీసీ నేతను బరిలోకి దింపాలని యోచిస్తున్నది. దీంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయులు నిరసన వ్యక్తం చేశారు. ఆయన గుంటూరు వెళ్లాని జగన్ సూచించారు. కానీ, ఆయన నిరాకరించారు. తాను నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కానీ, అందుకు జగన్ అంగీకరించలేదు. దీంతో శ్రీకృష్ణదేవరాయులు పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మూడు రోజుల క్రితమే ఈ ప్రకటన చేశారు. దీంతో నరసరావుపేట ఎంపీ స్థానంలో వైసీపీ ఎవరిని బరిలోకి దించుతుందా? అనే ఆసక్తి నెలకొంది.
ఇంతలో వైసీపీ చీఫ్ జగన్ తన నిర్ణయాన్ని అమల్లో పెట్టినట్టు తెలిసింది. నరసరావుపేట నుంచి ముందుగా అనుకున్నట్టే బీసీ కమ్యూనిటీకి చెందిన నేతను నిలబెట్టాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్‌ను అక్కడి నుంచి బరిలోకి దింపాలని ఖరారు చేసుకున్నట్టు సమాచారం. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ కలిశారు. నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని అనిల్ కుమార్ యాదవ్‌కు సీఎం జగన్ స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అనిల్ కుమార్ యాదవ్ సన్నద్ధం అవుతున్నారు.
Also Read: YSRCP: వైసీపీ ఐదో జాబితాపై తీవ్ర కసరత్తు.. మరో రెండు రోజుల్లో జాబితా ప్రకటన!