BRS MLA: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. భేటీపై ఏమన్నారంటే?

By Mahesh K  |  First Published Jan 29, 2024, 12:14 AM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది. అయితే, ప్రకాశ్ గౌడ్ ఈ     అంశంపై వివరణ ఇచ్చారు.
 


BRS MLA: ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఉభయ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఆ నలుగురూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు చర్చించారు. ఆ వార్తను ఖండించడానికి ఆ నలుగురూ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారా? అనే చర్చ మొదలైంది.

సీఎం రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్‌కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలిశారు. సీఎంను కలిసినప్పటి ఓ ఫొటో కూడా బయటికి వచ్చింది. దీంతో రాజకీయంగా దుమారం రేగింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వివరణ ఇచ్చారు.

Latest Videos

Also Read: Janasena: ఎన్నికల రంగంలోకి జనసేనాని.. అనకాపల్లి నుంచి ప్రచారం షురూ!

తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకాశ్ గౌడ్ తేల్చేశారు. తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానంటూ స్పష్టం చేశారు. అదే సమయంలో తాను సీఎంను రాజకీయ కారణాల కోసం కలువలేదనీ స్పష్టత ఇచ్చారు. అయితే, తన నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించడానికే తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు వివరించారు.

తన నియోజకవర్గంలోని భూ సమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధి నిధులను విడుదల చేయాలని తాను కోరినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఇదిలా ఉండగా... కాంగ్రెస్ లీడర్ మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ, తామే వారిని పార్టీలోకి తీసుకోవడం లేదని బాంబు పేల్చారు.

click me!