ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎల్లుండి ప్రధాని మోదీతో కీీలక భేటీ..!

Published : Dec 26, 2022, 11:24 AM ISTUpdated : Dec 26, 2022, 11:50 AM IST
ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎల్లుండి ప్రధాని మోదీతో కీీలక భేటీ..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. ఎల్లుండి (బుధవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా సీఎం జగన్ ‌సమావేశం కానున్నట్టుగా ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అయితే కేంద్ర మంత్రులు సమయ అనుకూలతను అనుసరించి.. కొన్ని అపాయింట్‌మెంట్స్ ఖరారు కావాల్సి ఉందని పేర్కొన్నారు.

మోదీ జరిగే సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు, పలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన హామీలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోదీ వద్ద సీఎం జగన్ ప్రస్తావించనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ప్రధానితో జగన్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

PREV
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu