ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట్లో విషాదం..

Published : Dec 26, 2022, 09:23 AM IST
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట్లో విషాదం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ది  శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆదిమూలపు సురేష్ తల్లి థెరీసమ్మ కన్నుమూశారు. 

ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ది  శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆదిమూలపు సురేష్ తల్లి థెరీసమ్మ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న థెరీసమ్మ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ఈ రోజు మార్కపురం తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు మార్కాపురం జార్జి గ్రీన్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

థెరీసమ్మ.. టీచర్‌గా పనిచేశారు. ఎందరినో ఉన్నత విద్యావంతులుగా ఆమె తీర్చిదిద్దారు. ఆమె ప్రస్తుతం డాక్టర్ ఆదిమూలపు శామ్యూల్ జార్జి విద్యాసంస్థలకు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. థెరీసమ్మ  మృతితో ఆదిమూలపు సురేష్ ఇంట్లో విషాదం నెలకొంది. పలువురు సన్నిహితులు, వైసీపీ నేతలు.. సురేష్ తల్లి థెరీసమ్మ మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. టీచర్‌గా ఉంటూ.. విద్యారంగానికి ఆమె చేసిన సేవలను పలువురు గుర్తుచేసుకుంటున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్