అలా చేసి మరొక సారి మా కాపు జాతి మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకోండి: సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ

Published : Dec 26, 2022, 10:53 AM IST
అలా చేసి మరొక సారి మా కాపు జాతి మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకోండి: సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై పరిశీలన చేయాలని లేఖలో కోరారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై పరిశీలన చేయాలని లేఖలో కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చన్న కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై దృష్టి పెట్టాలని అన్నారు. అందరూ తీసుకోగా మిగిలిన దాంట్లోనైనా తమ రిజర్వేషన్లు ఇప్పించాలని కోరారు. అన్ని కులాల మాదిరిగానే కాపు జాతికి వెలుగు చూపించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ ఇచ్చి పేద కాపులకు న్యాయం చేయాలని కోరారు.  ఎన్టీఆర్, వైఎస్సార్‌లను ప్రజలు దేవుళ్లుగా భావించారని పేర్కొన్న ముద్రగడ పద్మనాభం.. వారిలా పేద ప్రజలకు మేలు చేయాలని కోరారు. 

2019 అసెంబ్లీ ఎన్నికలలో కొద్ది పాటి నియోజకవర్గాలలో తప్ప మిగిలిన అన్ని  చోట్ల తమ కాపు జాతి వారందరూ వైఎస్ జగన్ గెలుపుకు కృషి చేశారని ముద్రగ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు.‘‘మా కాపుజాతికి రిజర్వేషన్లు కల్పించి మరొక సారి మా కాపు జాతి మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను’’ అని ముద్రగడ లేఖలో తెలిపారు. 

ఇక,  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు ఆర్టికల్ 342A (3) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవచ్చని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ ఇటీవల తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాపు సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై  రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్  సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్ర జాబితాలో  ఉన్న కాపులకు రిజర్వేషన్ల కల్పనలో తమ పాత్ర లేదని తెలిపింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు .. ఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్రం వెల్లడించింది. 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu