ఆ లేఖపై స్పందించొద్దు: వైసీపీ నేతలకు సజ్జల ఆదేశం

Published : Oct 15, 2020, 11:22 AM IST
ఆ లేఖపై స్పందించొద్దు: వైసీపీ నేతలకు సజ్జల ఆదేశం

సారాంశం

ఏపీ రాష్ట్ర హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఏపీ సీఎం జగన్ రాసిన లేఖపై పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడ మాట్లాడొద్దని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.


అమరావతి: ఏపీ రాష్ట్ర హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఏపీ సీఎం జగన్ రాసిన లేఖపై పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడ మాట్లాడొద్దని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.

ఈ నెల 10వ తేదీన  ఏపీ హైకోర్టు విషయమై సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీరమణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ లేఖ రాశాడు.ఈ విషయంలో పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేయవద్దని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ  నేతలకు వాట్సాప్ గ్రూప్ ద్వారా సందేశాన్ని పంపారు.

also read:సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై సీజేఐకి జగన్ లేఖ: ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్

రాష్ట్ర హైకోర్టు విషయంలో పార్టీ అభిప్రాయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తికి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ విషయమై మీడియా సమావేశాలు, ప్రతిక ప్రకటనలు విడుదల చేయవద్దని ఆయన సూచించారు. ఈ విషయమై పార్టీ నేతలు ఎవరూ కూడ మాట్లాడొద్దని కూడ ఆయన సూచించారు.

ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదు  చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తప్పు బట్టిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్