ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి అస్వస్థత: హైద్రాబాద్‌కి తరలింపు

By narsimha lodeFirst Published Oct 15, 2020, 10:25 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.దీంతో అత్యవసర చికిత్స కోసం ఆయనను ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ కు తరలించారు.హైద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో మంత్రి చికిత్స తీసుకొంటున్నట్టుగా ఆయన సన్నిహితులు తెలిపారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.దీంతో అత్యవసర చికిత్స కోసం ఆయనను ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ కు తరలించారు.హైద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో మంత్రి చికిత్స తీసుకొంటున్నట్టుగా ఆయన సన్నిహితులు తెలిపారు.

మంత్రి వెల్లంపల్లి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు. గత నెలలో మంత్రి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.  స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్లిన సీఎం  జగన్, ఇతర మంత్రులు, వైసీపీ నేతలు, అధికారులతో కలివిడిగా ఉన్నారు.

also read:మంత్రి వెల్లంపల్లికి కరోనా... సీఎం జగన్ ఆందోళన

ఆ తర్వాత ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో తిరుమల నుండి తిరిగొచ్చి విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వారం రోజులకు పైగా చికిత్స తీసుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్నాక ఈ నెల 8వ తేదీన విజయవాడలో పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక  కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ నెల 17వ తేదీ నుండి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని సీఎం జగన్ ను కోరారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

click me!