మాయమాటలు చెప్పి.. తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం యత్నం..

Published : Jul 09, 2023, 05:18 AM IST
మాయమాటలు చెప్పి.. తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం యత్నం..

సారాంశం

ఓ కామాంధుడు ఓ చిన్నారిని  మోసం చేసి, సెల్ఫోన్లో ఫొటోలు తీసి అసభ్యకరంగా ప్రవర్తించారు. పలుసార్లు  అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తిపై ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు.  

మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వం కఠినతర చట్టాలను తీసుకవచ్చిన  అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. ఆడ వాళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కామాంధులు రెచ్చిపోతున్నారు. దుర్మార్గులు వావి వరుసలు, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. నమ్మించి తమ కామవాంఛ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో దారుణం వెలుగులోకి వచ్చింది.

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి నమ్మించాడు ఓ కామాంధుడు. రహస్యంగా ఆ బాలిక అసభ్యకర వీడియోలను, సెల్ఫోన్లో ఫొటోలను సేకరించాడు. ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని ఆ బాలికను  బ్లాక్ మెయిల్ చేసి.. పలుమార్లు అత్యాచారం చేయడానికి యత్నించాడు.  ఈ క్రమంలో ఆ బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేయడంతో వారు ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

వివరాల్లోకెళ్తే.. విశాఖపట్నంలో 104 ఏరియా బాపూజీనగర్కు చెందిన సత్యరావు నేవల్ చిల్డ్రన్స్ స్కూల్లో అటెండర్ పనిచేస్తున్నాడు. అతడు నివసించే అపార్ట్మెంట్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఉంటుంది. ఆ బాలికపై కన్నేసిన సత్యరావు.. ఆమెతో స్నేహంగా మెలకడం ప్రారంభించాడు. బాలికకు మాయమాటలు చెప్పి.. ఆ కామాంధుడు అసభ్యకర ఫోటోలను సెల్ఫోన్లో ఫొటోలు తీశాడు. అప్పటి నుంచి వివిధ రకాలుగా బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ.. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. నాలుగు రోజులక్రితం.. ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో  తెలియజేసింది. దీంతో ఆ తల్లిదండ్రులు చెప్పడంతో వారు ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దిశ పోలీస్ స్టేషన్కు ఈ కేసును అప్పగించారు. దిశ డీఎస్సీ వివేరానంద శనివారం నిందితుని విచారించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్ కు తలించామని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం