భర్త కోసం పోలీస్ స్టేషన్ ముందు నిండు గర్భిణీ ధర్నా.. !

Published : Jun 16, 2021, 11:20 AM IST
భర్త కోసం పోలీస్ స్టేషన్ ముందు నిండు గర్భిణీ ధర్నా.. !

సారాంశం

నెల్లూరులో ఓ నిండు గర్భిణీ ధర్నాకు దిగింది. కోవూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె ధర్నాకు దిగింది. టీడీపీ ఎస్సీ సెల్ నేత కరటం మల్లికార్జున భార్య ఆమె. కరటం మల్లికార్జునను ఎమ్మెల్యే ప్రసన్న అనుచరులు కొట్టారంటూ ఫిర్యాదు చేస్తోంది.

కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ధర్నాకు కూర్చుంది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. నిండు గర్భిణి అయినా తన భర్త కోసం ఆమె అలా రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

గతంలో తన భర్త మీద ఎలాంటి కేసులు లేకున్నా, పోలీసులు కావాలనే తన భర్త మీద రౌడీ షీట్ తెరిచారని మల్లికార్జున భార్య ఆరోపిస్తోంది. తన భర్తను వెంటనే విడిచిపెట్టాలని ధర్నాకు దిగింది. 
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?