వచ్చే ఏడాది జనవరి నుండి పెన్షన్ ను రూ,. 2750కి పెంచుతామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రస్తుతం పెన్షన్ ను రూ. 2500 చెల్లిస్తున్నారు. ఈ పెన్షన్ కు మరో రూ. 250 అదనంగా కలిపి చెల్లించనున్నారు.
కుప్పం: వచ్చే ఏడాది జనవరి నుండి పెన్షన్ ను పెంచుతామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ ను రూ. 2, 750కి పెంచుతామన్నారు. ఎన్నికల నాటికి పెన్షన్ ను మూడు వేలకు వరకు తీసుకెళ్తామని సీఎం జగన్ తెలిపారు.
వైఎస్ఆర్ చేయూత పథకం కింద మూడో విడత నిధులను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు విడుదల చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ పర్యటించడం ఇదే తొలిసారి. 26.39 లక్షల మంది మహిళలకు రూ. 4,949 కోట్లను విడుదల చేశారు. వైఎస్ఆర్ చేయూత కింద ఇప్పటివరకు రూ. 14, 110 కోట్ల సహయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
undefined
మరో మంచి కార్యక్రమానికి కుప్పం నుండి శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. కుప్పం అంటే ఇవాళ అక్కా చెల్లెమ్మల అభివృద్ది అని సీఎం జగన్ చెప్పారు. కుప్పం అంటే ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల్లో అభివృద్ది అని జగన్ తెలిపారు. కుప్పం అంటే ఇవాళ చంద్రబాబు పాలన కాదన్నారు.
జగనన్న అమ్మఒడి ద్వారా 44 లక్షల 50వేల మందికి రూ. 19, 617 కోట్లు చెల్లించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రూ. 12, 758 కోట్లు అందించామన్నారు. చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ. 14, 110 కోట్ల సహాయం అందిందని సీఎం జగన్ తెలిపారు.సున్నా వడ్డీ కింద రూ. రూ. 3615 కోట్లు లబ్దిదారులకు అందిందని సీఎం జగన్ వివరించారు. 39 నెలల కాలంలో నాలుగు పథకాల ద్వారా తమ ప్రభుత్వం రూ. 51వేల కోట్లు అందించినట్టుగా సీఎం జగన్ తెలిపారు.
రాష్ట్రంలో 31 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. అక్కా చెల్లెళ్ల చేతికే రూ. 3 లక్షల కోట్ల ఆస్తిని తమ ప్రభుత్వం అందిస్తుందని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు సర్కార్ కంటే తమ ప్రభుత్వం తక్కువ అప్పులే చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం పేదలకు అమలు చేసిన పథకాలను చంద్రబాబు ఎందుకు చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
తమ ప్రభుత్వహయంలో లంచాలు,వివక్ష లేదని సీఎం చెప్పారు.లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులు చేరుతున్నాయన్నారు. డీబీటి ద్వారా అక్కాచెల్లెళ్లకు రూ. 1,17, 667 కోట్లు అందించినట్టుగా సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు పాలనకు తమ పాలనకు ఉన్న తేడాను గుర్తించాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు,సంపూర్ణ పోషణ గోరుముద్ద, విద్యాకానుక, జగనన్న తోడు కింద రూ. 1.41 లక్లల కోట్టు అందించామని సీఎం జగన్ తెలిపారు. డీబీటీ , నాన్ డీబీటీ ద్వారా ఇప్పటి వరకు 3.12 లక్షల కోట్లు ఇచ్చినట్టుగా జగన్ వివరించారు.