అర్థరాత్రి 12.10 a.m.. ఆయన పనిలో ఆయన

By sivanagaprasad kodatiFirst Published Oct 11, 2018, 8:15 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాడు నాయుడు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారులతో ఎలా పనిచేయించుకోవాలో.. వారికి ఎలా దిశానిర్దేశం చేయాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాడు నాయుడు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారులతో ఎలా పనిచేయించుకోవాలో.. వారికి ఎలా దిశానిర్దేశం చేయాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.

సహజంగా రోజుకు 18 గంటల పాటు కష్టపడే ఆయన.. తుఫానులు, వరదలు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో నిద్రకూడా పోరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అటూ ఇటూ కాస్త కూడా బెసక్కపోవడం.. ఎప్పుడూ ఒకేలా ఉండాలనుకోవడం ఆయన స్టైల్..

నాలుగేళ్ల క్రితం విశాఖను కుదేపేసిన హుధుద్ బీభత్సం సమయంలోనూ ఏమాత్రం సంయమనం కోల్పోలేదు. తుఫాను తగ్గిన తర్వాత వ్యానులో కూర్చోనే పరిస్థితిని చక్కదిద్దారు. తాజాగా తిత్లీ తుఫాను ఉత్తరాంధ్రను వణికించింది.

దీనిని ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. అనంతపురం జిల్లా పర్యటను ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి.. తిత్లీ ప్రభావం, సహాయకచర్యల గురించి కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఏమాత్రం విశ్రమించకుండా రాత్రి 12.30 గంటల వరకు అధికారులను అప్రమత్తం చేస్తూ.. రియల్‌టైమ్ గవర్నెన్స్ సాయంతో మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఉత్తరాంధ్రను వణికించిన తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు వద్ద ఇవాళ ఉదయం తీరాన్ని దాటింది. తుఫాను దాటికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికింది. 

తీరం తాకిన తుఫాను: శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం

click me!