తీరం తాకిన తుఫాను: శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం

By pratap reddyFirst Published Oct 11, 2018, 5:32 AM IST
Highlights

తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. పలు మండలాల్లో కరెంట్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. 53 కిలోమీటర్ల తుపాను కేంద్రకం విస్తరించి ఉంది. 

శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను తిత్లీ శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు,  పల్లెసారథి మధ్య గురువారం తెల్లవారు జామున తీరాన్ని తాకింది. 

తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. పలు మండలాల్లో కరెంట్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. 53 కిలోమీటర్ల తుపాను కేంద్రకం విస్తరించి ఉంది. 

గంటకు 14 కిలోమీ మీటర్ల వేగంతో కదులుతున్న తుపాను పెనుగాలులతో బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 120 నుంచి 150 కి.మీ.ల వేగంతో గాలులు విరుచుకుపడుతున్నాయి.

ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో పెను గాలులు వీస్తున్నాయి. తుఫాను తాకిడిని ఎదుర్కున్న మండలాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

పెనుగాలుల వల్ల ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 

click me!