
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కూతురి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబంతో చంద్రబాబు సన్నిహిత అనుబంధం మరోసారి ఈ వేడుకలో కనిపించింది.