
కురుపాం: Vizianagaram జిల్లా kurupam గురుకుల పాఠశాలలలో ముగ్గురు విద్యార్ధులకు పాము కరిచింది. ఈ గురుకుల పాఠశాలలో విద్యార్ధులకు బెడ్స్ లేవు. దీంతో వారంతా రాత్రి పూట నేలపైనే నిద్రిస్తారు. శుక్రవారం నాడు రాత్రి పూట నేలపై నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్ధులను పాము కరిచింది.
snake biteకు గురైన విద్యార్ధుల్లో Vamshi అనే విద్యార్ధి మరణించారు. పాము కాటుకు గురైన ఇద్దరు విద్యార్ధుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. Ranjit, Naveen అనే విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గురుకుల స్కూల్ సిబ్బంది తెలిపారు. ఈ స్కూల్ లో మొత్తం 217 మంది విద్యార్ధులున్నారు. పాము కాటుకు గురైన విద్యార్ధులంతా 8వ తరతగతి చదువుతున్నవారే.
బీసీ రెసిడెన్షియల్ స్కూల్ లో సిబ్బంది ఆజమాయిషీ సరిగా లేని కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్ధులను కాటేసిన పామును సిబ్బంది చంపేశారు.మరో వైపు గురుకుల స్కూల్ విద్యార్ధి మరణానికి స్కూల్ లో పనిచేసే సిబ్బందే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.