విజయవాడలో ఓ బస్సు డ్రైవర్ బరి తెగించాడు. ఒంటరిగా ఉందని చూసి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదుతో ఉద్యోగం ఊడి, జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు.
విజయవాడ : RTC Busలో ప్రయాణిస్తున్న తనతో driver అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ వివరాల ప్రకారం… బంధువుల శుభకార్యానికి నెల్లూరుకు వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు బుధవారం రాత్రి Nellore-Visakhapatnam ఇంద్ర ఏసీ బస్సుల్లో అనకాపల్లి వరకు టికెట్ తీసుకుని ఎక్కినట్లు తెలిపారు. బస్సులో మొత్తం ముగ్గురు ప్రయాణికులే ఉన్నారన్నారు. ఒంగోలు తర్వాత డ్యూటీ మారిన డ్రైవర్ తన పక్క సీట్లో కూర్చుంటుండగా.. అన్ని సీట్లు ఖాళీ ఉంటే ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? అని అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్పారు. ఫోన్ చార్జింగ్ కోసం కూర్చున్నట్లు తెలిపారని చెప్పారు.
బస్సు లో దీపాలు తీసేసిన తర్వాత తనతో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పారు. దీంతో వెనక సీట్ లో ఉన్న వృద్ధ ప్రయాణికుడిని సహాయం కోరగా.. అతను పక్షవాతంతో బాధపడుతున్నానని, సాయం చేయలేనని చెప్పాడని అన్నారు. దీంతో ఫోన్ ద్వారా అనకాపల్లిలోని భర్తకు సమాచారం ఇచ్చినట్లు ఆమె వివరించారు. తెలిసిన వారి ద్వారా బస్సు విజయవాడ బస్ స్టేషన్ కు చేరుకున్నాక డ్రైవర్ పై ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
undefined
విధుల నుంచి తొలగింపు..
అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ ఎ.జనార్ధన్ ను అధికారులు తక్షణం విధుల నుంచి తప్పించారు. మరో డ్రైవర్ ను ఏర్పాటు చేసి గురువారం జరిగిన తెల్లవారుజామున 1:00 సమయంలో బస్సును పంపారు. ప్రయాణికురాలి ఫిర్యాదు మేరకు ఘటనకు కారణమైన డ్రైవర్పై ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, తన భార్యతో Obsceneగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ యువకుడిమీద దాడి చేసిన నిందితుడు అతడి కళ్లలో ఐసు ముక్కతో పొడిచి తీవ్రంగా గాయపరిచిన ఘటన జనవరి 24న జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోని టాగోర్ గార్డెన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుల్లో ముగ్గురు స్థానికులకు చిక్కగా వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు బబ్లూ.. కుక్రేజా ఆస్పత్రి సమీపంలో ఓ చిన్న గుడిసెలో నివసిస్తుండేవాడు. పొరుగింట్లో ఉండే వ్యక్తి భార్యతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతటితో ఊరుకోకుండా దుర్భాషలాడడంతో.. అది చూసి తట్టుకోలేకపోయిన ఆమె భర్త బబ్లూతో వాగ్వివాదానికి దిగాడు. అది క్రమంగా ముదరింది. దీంతో పట్టలేని కోపంతో ఎలాగైనా బబ్లూ పని పట్టాలనుకున్నాడు. తన స్నేహితులకు సమాచారం అందించి పిలిపించాడు. వారిలో కలిసి బబ్లూ మీద దాడి చేశాడు. ఆ దాడిలో భాగంగా మంచు ముక్కతో బబ్లూ కుడి కంటిలో పొడిచాడు.
అప్పటికే గొడవకు అక్కడికి చేరుకున్న స్థానికులు ఇది గమనించారు. వెంటనే నిందితుల్లో ముగ్గురిని పట్టుకున్నారు. వీరిలో ఇద్దరి వయసు 28 యేళ్లు కాగా, ఓ బాలుడు కూడా ఉన్నాడు. వీరిని చితకబాదిన అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందిుతలను అంజు, నిలోపతిగా గుర్తించామని, మరో నిందితుడు సోహన్ ఠాకూర్ (30) పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గురు గోవింద్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కోలుకుంటున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.