నూజీవీడు ట్రిపుల్ ఐటీలో విషాదం... ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య..

Published : Mar 04, 2022, 09:02 AM IST
నూజీవీడు ట్రిపుల్ ఐటీలో విషాదం... ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య..

సారాంశం

నూజివీడు త్రిబుల్ ఐటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రిపుల్ ఐటీ ప్రథమ సంవత్సర విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి, అక్కల మీది బెంగతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  

నూజివీడు : Nuzvid IIITలో విద్యార్థి ఉరేసుకుని suicide చేసుకోవడం కలకలం రేపింది. విజయనగరం జిల్లా గొల్ల మండలం దామర సింగి గ్రామానికి చెందిన పియుసి విద్యార్థి  మండల రామూనాయుడు (17) గురువారం కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ hostalలో ఆత్మహత్య చేసుకున్నాడు.  

విజయనగరం జిల్లా గొల్ల మండలం చెందిన రామానాయుడు PUC మొదటి సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్ లోని హాస్టల్ లో ఉంటున్నాడు. గురువారం ఉదయం తరగతులకు వెళ్లడంతో పాటు మధ్యాహ్నం మెస్ కు వెళ్లి భోజనం చేశాడు.  మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఈ నెల 4న ట్రిపుల్ ఐటీకి రానున్న ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం మూడో ఫ్లోర్లోని సిద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో వారు గదిలో ఉరికి వెళ్ళాడుతున్న రామానాయుడిని గుర్తించారు.

వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.  అప్పటికే రామానాయుడుమృతి చెందాడు. గత నెల 25నే త్రిబుల్ ఐటీకి వచ్చిన అతడు ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  మృతుడి తల్లి గతంలోనే మరణించగా తండ్రి, అక్క ఉన్నారు.  వీరికి దూరంగా ఉండాల్సి వస్తుందని వేదనతోనే బలవన్మరణానికి పాల్పడిన ఉంటాడని భావిస్తున్నారు. ఈ కారణంతోనే గత నెల 13న కాలేజీ కి రావాల్సిన అతడు 25న వచ్చినట్లు ట్రిపుల్ ఐటీ వర్గాలు తెలిపాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 3గంటల ప్రాంతంలో భద్రతా సిబ్బంది, ఎలక్ట్రీషియన్లు కలిసి గదుల్లో లైట్లు, ఫ్యాన్లు బాగు చేసుకుంటూ వస్తున్నారు. రామానాయుడు ఉన్న గదికి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. పిలిచినా పలకకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు వెంటనే వారు విషయాన్ని యాజమాన్యానికి, ట్రిపుల్ ఐటీ పోలీస్ ఔట్ పోస్ట్ కు తెలియజేశారు. సీఐ అంకబాబు, ఎస్సై టి. రామకృష్ణ వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి విచారణ ప్రారంభించారు.

నాయుడికి ఆర్జీయూకేటీ ప్రవేశ పరీక్షలో 257వ ర్యాంక్ వచ్చింది. గతేడాది డిసెంబర్ 22న విద్యా సంస్థలో చేరాడు. ఓరియంటేషన్ తరగతుల తరువాత సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్ళాడు.  ఫిబ్రవరి 13న తరగతులకు హాజరు కావాల్సి ఉండగా 25వ తేదీ రాత్రి వచ్చాడు. గురువారం కూడా తరగతులకు హాజరయ్యాడు.  అతనికి తల్లి లేదు. తండ్రి అప్పన్న వ్యవసాయ కూలీ, తండ్రి,  అక్కను వదిలి రావడం ఇష్టం లేదు. 

స్థానికంగా ఉంటూ ఉన్నత విద్యనభ్యసించి వేరే ఉద్యోగానికి వెళ్ళాలి అనేది అతని కోరిక. తెలివిగల విద్యార్థి కావడం, ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు వచ్చినందున భవిష్యత్తు బాగుంటుందని కొంతమంది కౌన్సిలింగ్ ఇవ్వడంతో ట్రిపుల్ ఐటిలో చేరినట్లు సహచర విద్యార్థులు పోలీసులకు వివరించారు. సంక్రాంతి సెలవులకు వెళ్లి సుమారు 12 రోజులు ఆలస్యంగా క్యాంపస్ కు వచ్చాడు. అప్పుడు కూడా ఇతరులు బలవంతంగా చెప్పి పంపించడం వల్లే వచ్చాడని ఎస్సై రామకృష్ణ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu