స్కూలు బస్సు చక్రాల కింద నలిగిపోయి.. ఐదేళ్ల బాలుడి మృతి...

Published : Apr 22, 2023, 10:40 AM IST
స్కూలు బస్సు చక్రాల కింద నలిగిపోయి.. ఐదేళ్ల బాలుడి మృతి...

సారాంశం

స్కూల్ నుంచి ఇంటికి వస్తూ.. తాను ప్రయాణిస్తున్న బస్సు చక్రాల కిందపడి ఓ 5 యేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. 

అనంతపురం : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. స్కూల్ బస్సు ఓ బాలుడి ప్రాణాలు తీసింది. బస్సు దూసుకెళ్లడంతో దాని కింద పడి ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి గ్రామానికి చెందిన దంపతులైన మధు, వాణిలకు విహాన్ (5) ఒకగానొక్క కొడుకు. స్థానికంగా ఉన్న జ్ఞాన భారతి పాఠశాలలో ఒకటవ తరగతి చదువుకుంటున్నాడు.

ప్రతిరోజు లాగే శుక్రవారం నాడు కూడా మధ్యాహ్నం పాఠశాల నుంచి బస్సులో విహాన్ చాపిరి గ్రామానికి వచ్చాడు. మామూలుగానే బస్సు దిగాడు. ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు వెనుక చక్రాల కింద పడ్డాడు. ఇది బస్సు డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు తీసుకువెళ్లడంతో విహాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూల్ బస్సు డ్రైవర్ విహాన్ ని గమనించుకోలేదు. దీంతో ఈ ప్రమాదం జరిగింది.  

శ్రీకాకుళం : 18 నెలల చిన్నారిపై వీధి కుక్కల దాడి.. తీవ్రగాయాలతో కన్నుమూసిన పసికందు

ఇది గమనించిన గ్రామస్తులు స్కూలు బస్సు డ్రైవర్ పారిపోకుండా పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.  హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దీనిమీద కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా అనుకోకుండా మృతి చెందడం ఆ తల్లిదండ్రులను తీవ్రంగా కలిచి వేసింది. బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో గతనెల చోటు చేసుకుంది. హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సు కింద పడి 8యేళ్ల చిన్నారి మృతి చెందాడు. హైదరాబాదుకు 45 కిలోమీటర్ల దూరంలోని టెక్స్‌టైల్ గ్రామం పోచంపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బస్సు నుండి కిందపడి.. అదే బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఆ విద్యార్థి అభిలాష్. బస్సు డోర్‌కు తాళం వేయకపోవడం బస్సు నుంచి కిందపడిపోయాడు.

స్కూలు అయిపోయిన తరువాత సాయంత్రం బస్సు విద్యార్థులను వారి వారి ఇళ్లకు చేరుస్తోంది. ఈ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. “ప్రమాదం జరిగిన సమయంలో బాలుడు బస్సు మెట్ల దగ్గర నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ బస్సును మలుపు తిప్పడంతో బాలుడు కింద పడ్డాడు. ఆ తరువాత బస్సు నుండి జారిపడి వెనుక చక్రం కింద పడ్డాడు. దీంతో అది అతని మీదినుంచి వెళ్లింది”అని సబ్-ఇన్‌స్పెక్టర్ వి సైదిరెడ్డి తెలిపారు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు అభిలాష్ ఒకటో తరగతి విద్యార్థి. బాలుడి గ్రామానికి 200 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. “బస్సు కదులుతున్నప్పుడు డోర్ మూసి ఉంచి ఉంటే, ప్రమాదం జరిగి ఉండేది కాదు అని పోలీసులు చెప్పారు. “విద్యార్థులకు అటెండెంట్ గా ఓ ముసలామె ఉంది. ఆమె బస్సు తలుపు తాళం వేయడం మరిచిపోయింది. 

ఇతర విద్యార్థులు బస్సులో కూర్చున్నారు. అభిలాష్ మాత్రం విషాదం సంభవించినప్పుడు బస్సు దిగడానికి నిలబడి ఉన్నాడు”అని పోలీసులు తెలిపారు. పోచంపల్లి పోలీసులు బస్సు డ్రైవర్ రాములు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై  కేసు నమోదు చేశారు. బాలుడి తండ్రి రైతు అని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu