విశాఖలో రింగ్ వలల వివాదం: రెండు గ్రామాల మత్య్సకారుల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

Published : Jan 04, 2022, 12:49 PM IST
విశాఖలో రింగ్ వలల వివాదం: రెండు గ్రామాల మత్య్సకారుల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

సారాంశం

విశాఖపట్టణం జిల్లాలోని రెండు గ్రామాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.రింగ్ వలలతో కాకుండా సంప్రదాయ పద్దతుల్లోనే చేపల వేట చేయాలని కొంత కాలంగా ఈ ప్రాంతంలో మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. రింగ్ వలలతో చేపల వేట వద్దని కోరుతున్నారు.  


విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని peda jalaripeta లో సోమవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. Gangamma Thalli gudi , గంగమ్మతల్లిగుడి fishermen  మధ్య మంగళవారం నాడు ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల ఘర్షణలో సముద్రంలో ఓ బోటుకు నిప్పు పెట్టారు. రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య ఘర్షణలో పెద్దజాలరి పేటకు చెందిన నలుగురు మత్స్యకారులకు గాయాలయ్యాయి.

రింగ్ వలలతో  Fish వేట  చేయకూడదని సంప్రదాయ వలలతో చేపలను వేటాడే మత్స్యకారులు కోరుతున్నారు.ఇదే విషయమై రింగ్ వలలతో  చేపల వేటాడే వారితో సంప్రదాయపద్దతిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు గొడవకు దిగుతున్నారు. ఇదే విషయమై ఇవాళ  ఈ రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. రింగ్ వలలను నిషేధించాలని సంప్రదాయ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున మంగమూరిపేట తీరం వద్దకు చేరుకొన్నారు.దాదాపుగా 50  రోజులుగా సంప్రదాయ చేపల వేటకు వెళ్లే తమకు చేపలు దొరకడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. రింగ్ వలలను నిషేధించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?