సినిమాలో మాదిరిగానే: కారుతో ఢీకొట్టి ప్రత్యర్ధులపై దాడి, తిప్పికొట్టిన అవతలి వర్గం

Published : Oct 08, 2020, 03:21 PM IST
సినిమాలో మాదిరిగానే: కారుతో ఢీకొట్టి ప్రత్యర్ధులపై దాడి, తిప్పికొట్టిన అవతలి వర్గం

సారాంశం

అచ్చం సినిమాలో మాదిరిగానే ప్రత్యర్థులపై అవతలి వర్గం దాడి చేసింది. అయితే ఈ దాడిని వారు చాకచక్యంగా తిప్పికొట్టారు. దాడికి పాల్పడిన వారిని పారిపోయేలా చేశారు. ఫ్యాక్షన్ సినిమాలో చూపించే సన్నివేశాలను తలపించేలా ఉన్న ఈ ఘటన  గుంటూరు జిల్లాలో గురువారంనాడు చోటు చేసుకొంది.


 గుంటూరు: అచ్చం సినిమాలో మాదిరిగానే ప్రత్యర్థులపై అవతలి వర్గం దాడి చేసింది. అయితే ఈ దాడిని వారు చాకచక్యంగా తిప్పికొట్టారు. దాడికి పాల్పడిన వారిని పారిపోయేలా చేశారు. ఫ్యాక్షన్ సినిమాలో చూపించే సన్నివేశాలను తలపించేలా ఉన్న ఈ ఘటన  గుంటూరు జిల్లాలో గురువారంనాడు చోటు చేసుకొంది.

గుంటూరు జిల్లా కేపీగూడెంలో ఐదు మాసాల క్రితం గంగిరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గంగిరాజు హత్యలో కాశయ్య ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఇవాళ గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాదిబోడులో సినీ ఫక్కిలో కాశయ్య వర్గంపై గంగిరాజు వర్గం దాడికి దిగింది.

బైకులపై వెళ్తున్న 13 మందిని  కారుతో ఢీకొట్టి చంపేందుకు గంగిరాజు వర్గం ప్లాన్ చేసింది.  కారుతో ఢీకొట్టి తమను హత్య చేసేందుకు గంగిరాజు వర్గం ప్లాన్ చేసిందన్న విషయాన్ని పసిగట్టిన కాశయ్య వర్గం వెంటనే తేరుకొంది.

గంగిరాజు వర్గంపై రాళ్లతో దాడికి దిగింది. కాశయ్య వర్గం రాళ్లతో దాడికి దిగడంతో గంగిరాజు వర్గం వెనక్కి వెళ్లిపోయింది. ఈ ఘటన సినిమాలో ఫైట్ ను తలపిస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!