బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి పొంచివున్న ప్రమాదం: విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక

Arun Kumar P   | Asianet News
Published : Oct 08, 2020, 02:59 PM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి పొంచివున్న ప్రమాదం: విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక

సారాంశం

ఏపీలో భారీ వర్షాలు కురియడంతో పాటు తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలుల వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది, 

అమరావతి: రానున్న మూడు రోజులపాటు ఆంధ్ర ప్రదేశ్ లో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు పిడుగులు పడే అవకాశాలు వున్నట్లు ఐఎండి హెచ్చరించింది. కాబట్టి ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. 

ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని...ఆ తదుపరి 24గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని తెలిపారు. ఇలా ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం వుందన్నారు.

read more  మరో అల్పపీడనం... రానున్న నాలుగురోజులూ ఏపీలో భారీ వర్షాలు

దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురియడంతో పాటు  తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలుల వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. అలాగే తీర ప్రాంతాల్లో ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. 


 

PREV
click me!

Recommended Stories

Varudu Kalyani: ఆవకాయ ఫెస్టివల్ కి డబ్బులుంటాయి.. ఆడబిడ్డ నిధికి డబ్బులుండవా? | Asianet News Telugu
Nellore Sp Ajitha Vejendla: వాటిని నమ్మొద్దు.. వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు | Asianet News Telugu