కమాండ్ కంట్రోల్ రూమ్‌ ప్రారంభం.. సివిల్‌ సప్లయ్‌ వాహనాలను జియో ట్యా గింగ్ తో ట్రాక్.. : ఏపీ ప్రభుత్వం

Published : Feb 09, 2023, 06:37 AM IST
కమాండ్ కంట్రోల్ రూమ్‌ ప్రారంభం..  సివిల్‌ సప్లయ్‌ వాహనాలను జియో ట్యా గింగ్ తో ట్రాక్.. : ఏపీ ప్రభుత్వం

సారాంశం

Vijayawada: విజయవాడలోని సివిల్‌ సప్లయ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ ను పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికారులతో క‌లిసి ప్రారంభించారు. ఇది రోజువారీ రేషన్ సరఫరా, గోడౌన్ స్టాక్ పాయింట్లు, రేషన్ పంపిణీ కోసం వాహనాల కదలికలను పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. 

Civil Supplies Minister Karumuri Venkata Nageswara Rao: విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికారులతో క‌లిసి ప్రారంభించారు. ఇది రోజువారీ రేషన్ సరఫరా, గోడౌన్ స్టాక్ పాయింట్లు, రేషన్ పంపిణీ కోసం వాహనాల కదలికలను పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. బుధవారం విజయవాడలో ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ధాన్యం కొనుగోళ్లు, ప్రజాపంపిణీ వ్యవస్థను పౌరసరఫరాల శాఖ పర్యవేక్షిస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.

విజయవాడ కానూరులోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూంను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ రేషన్ సరఫరా, గోడౌన్ స్టాక్ పాయింట్లు, రైస్ మిల్లులు, రేషన్ పంపిణీకి ఉపయోగించే వాహనాల కదలికలను కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించవచ్చని తెలిపారు.

రైస్ మిల్లుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామనీ, అక్రమాలకు చెక్ పెట్టేందుకు మిల్లింగ్ కార్యకలాపాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని నాగేశ్వరరావు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఉత్తరాంధ్రలో చిరుధాన్యాల సాగు, గోధుమ పిండి పంపిణీని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. 

అలాగే, సివిల్‌ సప్లయ్‌ వాహనాలకు జియో ట్యాగింగ్ చేయ‌డంతో వాహనాలను ట్రాక్‌ చేస్తామని చెప్పారు. సివిల్ స‌ప్ల‌య్ ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందేలా వ్య‌వ‌స్థ ఏర్పాటు చేసిన‌ట్టు మంత్రి పేర్కొన్నారు. రేషన్ బియ్యం, ధాన్య సేకరణ, కార్డుల జారీ తదితర ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తున్నారన్న అంశాలు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం తెలుసుకుంటుంద‌ని తెలిపారు. దానినిక అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో క‌మాండ్ కంట్రోల్ రూమ్ చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి వీలుక‌ల్పిస్తుంద‌ని కూడా చెప్పారు. 

గోధుమ పిండి పంపిణీని దశలవారీగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. రేషన్ కార్డుదారులకు నాసిరకం కందిపప్పు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. పంపిణీకి ముందు నాణ్యతను అధికారులు స్వయంగా పరిశీలిస్తారని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయ‌కుడు, రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సంబంధిత విభాగం అప్పుల భారం పెర‌గ‌డానికి చంద్ర‌బాబు నాయుడే కార‌ణమంటూ ఆరోపించారు.

విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభ‌ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్, డైరెక్టర్ ఎం.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు.

అంత‌కుముందు, రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వరి కొనుగోలు చేయడమే కాకుండా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పిస్తోందని పౌరసరఫరాలు-వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కే. వెంకట నాగేశ్వరరావు తెలిపారు.  శుక్ర‌వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులు పండించిన ఉత్పత్తులకు ఎంఎస్‌పి అందించడంతో పాటు మధ్య దళారుల వ్యవస్థ కూడా లేకుండా పోయిందని అన్నారు. రైతుల గురించి మిల్లర్లకు సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరుతున్నారని, గతంలో ₹1,200 ఉన్న ఎంఎస్‌పి ఇప్పుడు ₹1,530కి పెంచామని ఆయన చెప్పారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామ‌ని తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Fog Alert : అధికపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాగ్ సైక్లోన్ కొనసాగుతోందా..? ఈ 12 జిల్లాలకు హైఅలర్ట్
IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu