మళ్లీ వైసీపీ గెలిస్తే .. జేసీ సోదరులు బిచ్చం ఎత్తుకోవాల్సిందే : ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 08, 2023, 09:49 PM IST
మళ్లీ వైసీపీ గెలిస్తే .. జేసీ సోదరులు బిచ్చం ఎత్తుకోవాల్సిందే : ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలు

సారాంశం

తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు . 2024లో మరోసారి వైసీపీ గెలిస్తే తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ బిచ్చమెత్తుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీనని చెప్పుకుంటున్నాడని ప్రతి వైసీపీ కార్యకర్త, నాయకుడూ రౌడీలేనని పెద్దారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జేసీ సోదరులను ఉద్దేశిస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ బిచ్చమెత్తుకోవాల్సిందేనంటూ కామెంట్ చేశారు. తాను పాదయాత్ర చేస్తుంటే జేసీ కరపత్రాలు పంచుతున్నాడని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద, తన కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు పెడితే.. దానికి మూల్యం మీ ఇంటి నుంచే మొదలవుతుందని హెచ్చరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీనని చెప్పుకుంటున్నాడని ప్రతి వైసీపీ కార్యకర్త, నాయకుడూ రౌడీలేనని ఎమ్మెల్యే అన్నాడు. జేసీ సోదరులపై వున్న కేసులపై చర్యలు తీసుకోవాలని .. లేనిపక్షంలో ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని పెద్దారెడ్డి హెచ్చరించారు. 

ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్రపై విమర్శలు గుప్పించారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. లోకేష్ తన పాదయాత్రలో ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటాడని ప్రశ్నించారు. పప్పుదినుసులను కూడా గుర్తుపట్టలేని లోకేష్ కూడా విమర్శలు చేస్తున్నాడని చురకలంటించారు. తాడిపత్రిలో రాజకీయం చేయాలంటే కత్తికి కత్తి పట్టాల్సిందేనని .. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ కరువు వస్తుందని కేతిరెడ్డి అన్నారు. 

ALso REad: పోలీసులకు జేసీ బ్రదర్స్ అంటే భయం ఉంటే.. కశ్మీర్‌ మాదిరి స్పెషల్ జోన్‌ ప్రకటించాలి: ఎమ్మెల్యే పెద్దారెడ్డి

కొద్దిరోజుల క్రితం కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు జేసీ బ్రదర్స్ అంటే భయం ఉంటే.. కశ్మీర్‌ మాదిరి స్పెషల్ జోన్‌ను ప్రకటించి ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. తాడిపత్రిలో నేతల మధ్య కార్నర్‌గా మారారని అన్నారు. పోలీసులకు జేసీ బ్రదర్స్ అంటే ఎందుకంత మోజు అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై విమర్శలు చేస్తుంటే పోలీసు సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. పోలీసు యూనియన్లకు జేసీ ప్రభాకర్ రెడ్డే అధ్యక్షుడా? అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

YSRCP Leaders Protest at ABN Office: ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ నాయకులు| Asianet Telugu
MP Ambica G Lakshminarayana Speech: అనంతపూర్ ఎంపీ అంబికా పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu