వైసీపీలోకి సినీ నటుడు అలీ, ముహుర్తం ఖరారు

Published : Jan 04, 2019, 10:16 AM IST
వైసీపీలోకి సినీ నటుడు అలీ, ముహుర్తం ఖరారు

సారాంశం

గత నెల డిసెంబర్ 28న ఎయిర్ పోర్టులో అలీ.. జగన్ ని కలిసిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఆ రోజు నుంచి అలీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి.

ప్రముఖ సినీ నటుడు అలీ.. వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 9వ తేదీన జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగియనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈ పాదయాత్రను జగన్ ముగింపు పలకున్నారు. కాగా.. అదే రోజు అలీ.. జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

గత నెల డిసెంబర్ 28న ఎయిర్ పోర్టులో అలీ.. జగన్ ని కలిసిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఆ రోజు నుంచి అలీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. కాగా.. వాటిని ఇప్పుడు అలీ నిజం చేశారు. జగన్ ఆదేశిస్తే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమంటూ అలీ తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం.

గత నెలలో జగన్ ని ఆలీ కలిసినప్పుడు సుమారు గంటపాటు వ్యక్తిగతంగా చర్చించుకున్నారు. జగన్ చేపట్టిన పాదయాత్రపై అలీ ప్రశంసలు కురిపించారు. నిత్యం ప్రజల్లో ఉండాలనే తపనతో ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని అలీ అభిప్రాయపడ్డారు. అలాగే పాదయాత్రలో పార్టీకి వస్తున్న మైలేజ్ పై కూడా ఇరువురు చర్చించుకున్నారు.

read more news

వైఎస్ జగన్ ను కలిసిన సినీనటుడు ఆలీ

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్