రోజా నాకు ఫ్రెండ్, పోటీదారులం కాదు: ప్రియా రామన్

Published : Jul 24, 2019, 04:56 PM ISTUpdated : Jul 24, 2019, 05:07 PM IST
రోజా నాకు ఫ్రెండ్, పోటీదారులం కాదు: ప్రియా రామన్

సారాంశం

సినీ నటి ప్రియారామన్ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రియా రామన్ రాజకీయాల్లోకి రానున్నారు. త్వరలోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

తిరుపతి: రోజా నాకు మంచి ఫ్రెండ్....తామిద్దరం పోటీ దారులం కాదని  సినీ నటి ప్రియా రామన్  చెప్పారు. 

బుధవారం నాడు ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.  ప్రజా సేవ చేసేందుకే తాను బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రియా రామన్ ప్రకటించారు.  ఏపీ రాజకీయాలపై తాను ఇప్పుడే చెప్పలేనని ప్రియా రామన్ స్పష్టం చేశారు.

పార్టీ ఏం చేయాలని ఆదేశిస్తే తాను  ఆ పని చేస్తానని ఆయన ప్రకటించారు.  త్వరలోనే ప్రియా రామన్ బీజేపీలో చేరనున్నారు. ప్రియా రామన్ బీజేపీలో చేరే విషయమై స్పష్టత ఇచ్చారు. భవిష్యత్తులో ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇతర పార్టీల నేతలతో పాటు సినీ గ్లామర్ ను కూడ ఉపయోగించుకోవాలని కాషాయ దళం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

ప్రియారామన్‌తో రోజాకు చెక్: ఏపీలో బీజేపీ వ్యూహం ఇదీ...


 

PREV
click me!

Recommended Stories

Hero Ghattamaneni Jayakrishna Speech: జై బాబు.. బాబాయ్ కి నేను పెద్ద ఫ్యాన్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం | Asianet Telugu