పెళ్లి పేరుతో టోకరా వేసిన యువతి..! వీఆర్వో, ఆమె కూతురిపై పోలీసులకు ఫిర్యాదు...!!

By SumaBala Bukka  |  First Published Jun 28, 2022, 7:26 AM IST

గుంటూరులో ఓ వ్యక్తి యువతి తనను మోసం చేసిందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు ఖర్చు చేయించి.. ఇప్పుడు మోసం చేసిందంటూ చెబుతున్నాడు. 


గుంటూరు : పెళ్లి పేరుతో వంచించాడని, లక్షలాది రూపాయలు తీసుకొని పెళ్లి చేసుకొని… మోసం చేశాడంటూ తరచుగా మహిళలు ఫిర్యాదు చేయడం చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఓ యువతిపై బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది... ఎందుకంటే ఇటీవల అమ్మాయిలు మోసగిస్తున్న కేసులు అడపాదడపా కనిపిస్తున్నాయి. అలాంటిదే ఈ కేసు కూడా. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… 

ఆ బాధితుడు చెప్పిన ప్రకారం ‘నేను బీటెక్ చదివాను. ప్రస్తుతం గుంటూరులో మోటో కంట్రోలర్ మెకానిక్ గా పనిచేస్తున్నాను. నా తండ్రి పోలియోతో, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు.  నేను వారికి ఒక్కడినే కుమారుడిని. రెవెన్యూశాఖలోని ఓ విశ్రాంత ఉద్యోగి నాకు పరిచయమయ్యారు. అలా వారు మా జిల్లా లోని ఓ విఆర్వో కుమార్తెతో వివాహం కుదిర్చారు. ఆ అమ్మాయికితండ్రి లేరని తాను కట్నం ఇచ్చుకోలేని తల్లి చెప్పడంతో పైసా కట్నం లేకుండా పెళ్లికి అంగీకరించాం. ఫిబ్రవరిలో వివాహం అయ్యింది. పెళ్లి సమయంలో అమ్మాయికి రూ. రెండు లక్షల ఆభరణాలు  చేయించాం. మా ఊరులో రూ. ఆరు లక్షలతో రిసెప్షన్ చేశాం.  

Latest Videos

ఉద్యోగం కోసం రెస్యూమ్ పంపితే.. నగ్నవీడియోలు, ఫొటోలు పంపాలని బ్లాక్ మెయిల్..

ఏమయిందో ఏమో తెలియదు కానీ... రిసెప్షన్ అయిన వెంటనే ఆమె తన కుమార్తె  పుట్టింటికి తీసుకు వెళ్ళింది. తొలి రాత్రి నుంచి యువతి నన్ను దూరం పెట్టింది. ఒక్క రోజు కూడా కాపురం చేయలేదు.  నెలల తరబడి ఆమె పుట్టింటి నుంచి రావడం లేదు.  మా పెద్దలు వెళ్లి అడిగితే గుంటూరులో ఇల్లు అద్దెకి తీసుకోమన్నారు. అలాగే చేశాం. అయితే, అక్కడ కూడా ఒకరోజు ఉండి తనను తాకవద్దంటూ రెండో రోజు పుట్టింటికి వెళ్లిపోయింది. గట్టిగా నిలదీయడంతో కట్నం ఇవ్వమంటున్నారు అని మా పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రూ. 10 లక్షల డబ్బులు  ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఆ సమయంలోనే మాకు ఒక విషయం తెలిసింది. మా అత్త వీఆర్వోగా పనిచేసిన గ్రామంలో నిరుడు ఓ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగితో యువతికి నిశ్చితార్థం చేశారట. ఆ విషయం దాచిపెట్టి మాతో వివాహం అంటూ.. తతంగం నడిపారు. మరొకరితో పెళ్లి తంతు నడుపుతూ నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు అనిపిస్తుంది. మమ్మల్ని మోసగించిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాం ’అని తెలిపారు. 

click me!