చంద్రబాబుతోభేటీ: టీడీపీలోకి అలీ?

Published : Jan 20, 2019, 02:27 PM IST
చంద్రబాబుతోభేటీ: టీడీపీలోకి అలీ?

సారాంశం

  ఏపీ సీఎం చంద్రబాబుతో  సినీ నటుడు అలీ ఆదివారం నాడు సమావేశమయ్యారు. సినీ నటుడు అలీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

అమరావతి:  ఏపీ సీఎం చంద్రబాబుతో  సినీ నటుడు అలీ ఆదివారం నాడు సమావేశమయ్యారు. సినీ నటుడు అలీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

సినీ నటుడు  అలీ  వైసీపీ, జనసేనలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను రైల్వే స్టేషన్‌లో  కలిశానని అలీ ప్రకటించారు.

జగన్‌ను కలిసిన కొన్ని రోజులకే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో పవన్ కళ్యాణ్‌ను కలిశారు.  పవన్ కళ్యాణ్‌ను కలిసి రోజునే ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కూడ అలీ కలిశారు.

ఆదివారం నాడు సినీ నటుడు అలీ   ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో  చర్చించారు.  అలీ టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.ఇదే అభిప్రాయాన్ని కూడ జనసేన నేతలు కూడ చెబుతున్నారు.

గత ఎన్నికల సమయంలోనే అలీని గుంటూరు సిటీ నుండి  టీడీపీ బరిలోకి దింపాలని భావించింది. మాజీ కేంద్ర మంత్రి   సుజనా చౌదరి  అలీతో  చర్చించారు. కానీ, ఆ సమయంలో పోటీకి  ఆయన దూరంగా ఉన్నారు.  కానీ, వచ్చే ఎన్నికల సమయంలో  అలీ పోటీకి ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అయితే అలీ ఏ పార్టీలో చేరుతారో ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు: బాబుతో అలీ భేటీ, ఏం జరుగుతోంది?

 


 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు